ఆంధ్రవిశ్వవిద్యాలయం నవంబర్ 12 :
ఏయూ డిపార్ట్మెంట్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ అధ్వర్యంలో ఏయూ సిల్వర్ జూబ్లీ క్రీడా మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న పురుషుల ఇంటర్ కాలిజియట్ పురుషులు బాస్కెట్ బాల్ పోటీలు బుధవారం ముగిసాయి. ఈపోటీల్లో బాస్కెట్ బాల్ ఫైనల్స్ ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీ రింగ్ కళాశాలకు ప్రగతి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు జరిగాయి. మ్యాచ్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలకు 48 పాయింట్లు, ప్రగతి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు 42 పాయింట్లు వచ్చాయి. ఈ మాచ్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రధమ స్థానంలో విజేతగా నిల్చింది. మరో మ్యాచ్ ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలకు ఎ.వి.ఎన్ కళాశాలకు మాడువ స్థానానికి జరిగిన మ్యాచ్ ఏ యూ ఆర్ట్స్ కళాశాల 46 పాయింట్లు, ఎ. వి. ఎవ్ కళాశాలకు 41 పాయింట్లు వచ్చాయి. ఈ మ్యాచ్ ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల విజేతగా నిల్చింది. ఈసందర్భంగా జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షలు బి. రామయ్య, వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, మోహన్ ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎస్. విజయ విజేతలకు బహుమతి ప్రధానంచేసారు. ఈ కార్యక్రమంలో ఎవిఎస్ కళాశాల ఏడి డాక్టర్ గోపీకృష్ణ, బుల్లయ్య కళాశాల వ్యాయామ విద్యా విభాగం హెడ్ డాక్టర్ వై. శ్రీనివా సరావు, గీతం యూనివర్శిట్ పూర్వ వ్యాయామ విద్యావిభాగం డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ. డా క్టర్ లక్ష్మణరెడ్డి, డాక్టర్ దిలీప్, కోచ్ రామచంధ్ర క్రీడాకారులు పాల్గొన్నారు.
