పెన్‌స్టేట్‌ వర్సిటి బృందం గీతం సందర్శన

ఆంధ్రప్రదేశ్‌
పెన్‌స్టేట్‌ వర్సిటి బృందం గీతం సందర్శన

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 12  : అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటైన పెన్‌స్టేట్‌ విశ్వవిద్యాలయం అకడమిక్‌ నిపుణుల బృందం బుధవారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పెన్‌స్టేట్‌ విశ్వవిద్యాలయం అడ్మిషన్ల అసోసియేట్‌ డైరక్టర్‌ అమందాఎల్‌ మోర్‌, గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌ కో`ఆర్డినేటర్‌ ఎండీ మొనిహన్‌, మార్కెటింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ రే.వెంకటరామన్‌లు గీతంలోని పలు విభాగాలను సందర్శించారు. అనంతరం గీతం ప్రో వైస్‌`ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గీతం ప్రో వైస్‌`ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు మాట్లాడుతూ గీతం విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాలను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. బోధన, పరిశోధన అంశాలలో పరస్పర సహకారంతో పాటు ఉమ్మడిగా పిజి,యుజి కోర్సులను ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాలలో అందించడానికి రెండు విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజి, గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లలో విద్యార్ధులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో పెన్‌స్టేట్‌ విశ్వవిద్యాలయ నిపుణులు తమ విద్యాలయంలో అందిస్తున్న కోర్సుల వివరాలను తెలియజేస్తు 140కి పైగా దేశాల విద్యార్ధులు తమ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో గీతం అదర్‌ కెరీర్‌ ఆప్షన్స్‌ డిప్యూటీ డైరక్టర్‌ డాక్టర్‌ రవికాంత్‌ పాల్గొని రెండు విశ్వవిద్యాలయాల మధ్య గతంలో కుదిరిన అవగాహన ఒప్పందంలోని అంశాలను విద్యార్ధులకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *