Visakhapatnam, Flashmail N
ews November 10 : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో సాయంత్రం సరిగ్గా 6. 52గంటల సమయంలో ట్రాఫిక్ రెడ్లైట్ వద్దకు నెమ్మదిగా సమీపిస్తున్న ఓ కారులో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇది నేటి విషాదం. ఇదిలా ఉండగా అదే రోజు దేశంలో మరో ఘటన. ఉగ్ర కుట్ర భగ్నం. 8 మంది అరెస్టు.. వారిలో ముగ్గురు వైద్యులు. 2,900 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం. రానురాను మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పుగా భావించి, ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అన్నిరూపాల్లో అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉగ్రవాద ఘటనలు ఎక్కడ జరిగినా అది ప్రపంచ శాంతికి ముప్పు. నీతిమాలిన మనుషులకు క్రూర మృగాలకంటే పైశాచికత్వం ప్రదర్శించే మతోన్మాద శక్తులుగా పిలువబడే ఉగ్రవాదులకు … భారత ప్రభుత్వం ఇకనైనా దీటైన జవాబు చెప్పాలి …! మంచి, మానవత్వం అని మడికట్టుకుని కూర్చుంటే ఉగ్రవాదం వెర్రితలలు వేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది.. ఎందుకు భారతీయులు తమ ప్రాణాలు కోల్పోవాలి..? మూర్కత్వం మూటగట్టి.. కర్కశత్వం కరుడుగట్టి మతతత్వం మంటబెట్టి దుర్మార్గం వెన్నుతట్టి రక్త తర్పణంతో ఉగ్రవాదులు సాధించేది ఏముంది …? ఓ భారత దేశమా ఇకనైనా విజృభించు … మన శక్తిని రక్తపిశాచులకు చూపిద్దాం…!
ప్రపంచ శాంతికి బాటలు వేద్దాం!
ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు
లయన్స్ డిస్ట్రిట్ గవర్నర్ (2000-2001).
మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం
మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ కాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్, విశాఖపట్నం.
