ఇంటర్ కాలిజియట్ వాలీబాల్ పోటీల్లో విడిసి మహిళా కళాశాల విజయం

క్రీడలు

Visakhapatnam, Flashmail News Media November 10 : ఏయూ సిల్వర్ జూబ్లీ క్రీడా మైధానంలో సోమవారం జరిగాయి. ఈపోటీల్లో యూనివర్శిటీ ఎఫిలియేషన్ కళాశాలలు పాల్గొన్నాయి. మహిళల వాలీబాల్, పోటీల్లో విజేతలుగా విశాఖ గవర్నమెంట్ డిగ్రీ మహిళా కళాశాల ప్రధమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో గాయంత్రి ఇంజనీరింగ్ కళాశాల, తృతీయ స్థానంలో ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ విజేతలుగా నిల్చాయి. బహుమతి ప్రధానానికి ఏయూ రెక్టార్ ఆచార్య పి. కింగ్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతి ప్రధానం చేసి మహిళా జట్లును అభినందించారు. | అనంతరం మాట్లాడుతూ యూనివర్శిటి క్రీడాకారులను ప్రోత్సాహం కల్పించడం జరుగుతుందన్నారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడుతూ ఇంటర్ కాలిజియట్ పోటీల్లో ప్రతిభ సాదించిన క్రీడాకారులు యూనివర్శిటి పోటీలకు ఎంపికవుతారన్నారు. ఏయూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ ఆచార్య సీతామాణిక్యం, ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, విశాఖపట్నం ఉమెన్స్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఫీజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ డాక్టర్ కిరణ్మయి, ఎవిఎన్ కళాశాల వ్యాయామ విద్యా విభాగం హెడ్ డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ దిలీప్, పరిశోధకులు ఉదయ్, ఎంపిఈడీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *