ఏ యూ ఇంటర్ కాలేజియట్ అథ్లెటిక్స్ పోటీలు అల్ రౌండ్ ఛాంపియన్స్ గా పురుషులు, మహిళలు విభాగంలో ప్రగతి కాలేజీ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్

క్రీడలు

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 12 : ఆంధ్ర యూనివర్సిటీ ఇంటర్ కాలేజియట్ అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం సాయంత్రం ముగిసాయి. ఈ సందర్భంగా ఏయూ రెక్టార్ ప్రొఫెసర్ పి కింగ్ ముఖ్యఅతిది గా పాల్గొని విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఆల్ రౌండ్ ఛాంపియన్ గా ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పురుషులు, మహిళల విభాగం లో నిలిచాయి.ఈ సందర్భంగా ఏ యూ రెక్టర్ పీ. కింగ్ మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రీడలకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంద న్నారు అనంతరం విజేతలను అభినందించారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్ విజయ మోహన్ మాట్లాడుతూ రెండు రోజులు పాటు పోటీలు నిర్వహింఛా మన్నారు. దాదాపు 70 కళాశాలలు నుంచి 700 వందలు కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. మొదటి రోజు వి సి ఆచార్య జిపి రాజశేఖర్ ప్రారంభించారని, రెండవ రోజు రెక్టర్ బహుమతి ప్రధానం చేయడం అభినంద నీయమన్నారు. ఏయూ అథ్లెటిక్స్ ఇంటర్ కాలేజిట్ అల్ రౌండ్ ఛాంపియన్ పురుషులు, మహిళల విభాగం లో ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ద్వితీయ స్థానంలో స్థానంలో పురుషులు విభాగం లో అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళల విభాగంలో ద్వితీయ స్థానం విజయనగరం ఏం ఆర్ కాలేజ్ నిలిచింది. ఈ కార్యక్రమం లో ఏ యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం హెడ్ ప్రొఫెసర్ ఏ. పల్లవి, పిడి రవి కుమార్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వై శ్రీనివాసరావు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *