విశాఖపట్నం. నవంబర్ 9 ఫ్లాష్ మెయిల్ న్యూస్ : ధనలక్ష్మి డిజిటల్ జోన్ ను గంటా శ్రీనివాసరావు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు ఆనందపురం మండలం వేములవలస కూడలిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరన్నారు. డిజిటల్ జోన్ అధినేతలు రెడ్డి రామ లక్ష్మణ్ కవల సోదరులు ఇందుకు నిదర్శనంగా చెప్పుకొచ్చారు ఒకప్పుడు సాదాసీదాగా ఫోటో స్టూడియో వ్యాపారంలో దిగిన వీరు వారి వ్యక్తిగత శ్రమతో ఈ స్థాయికి ఎదగటం గర్వకారణమన్నారు. వీరి స్ఫూర్తితో మిగతా యువత అంతా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని బోస్ టిడిపి నాయకులు బి ఆర్ బి నాయుడు, తాట్రాజు అప్పారావు, మహంతి శివాజీ కాకర వెంకటరమణ, , కాకర్లపూడి శ్రీకాంత్ రాజు, కోరాడ రాము, బమ్మిడి ఉమ, ఆబోతు అప్పల రాము. కోరాడ వైకుంఠం. కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, బిజెపి నాయకులు ఉప్పాడ అప్పారావు, ప్రసాద్ రావు పట్నాయక్, మీసాల రామనాయుడు, వైకాపా నాయకులు కోరాడ వెంకటరావు,బంక సత్యం, మీసాల సత్యనారాయణ, చందక లక్ష్మి, చందక సూరిబాబు, లతో పాటు పార్టీలకతీతంగా అందరు నాయకులు పాల్గొన్నారు.
