
విశాఖ ఎడ్యుకేషన్, మార్చ్ 26 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : రోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు హాస్పిటల్ క్లినికల్ లాబ్ ను అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్ , యూరిన్ ఎనలైజర్ కొనుగోలు కొరకు ఎన్వేద థెరప్యూటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారత సంస్థ యొక్క డైరక్టర్ లయన్ సిఎన్ఎస్పి కృష్ణారావు, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు ద్వారా రూ.4,59,000/- (నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు) కంపెనీ సామాజిక బాధ్యతగా విరాళం అందించారు. ఎన్వేద థెరప్యూటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కొత్త అణువులు ఔషధాలపై పరిశోధనలో నిమగ్నమైన ఒక సంస్థ. ఈ సంస్థ యొక్క యువ వ్యవస్థాపకుడు/సీఈఓ, డాక్టర్ విశ్వ తేజ కొల్లూరు. డాక్టర్ విశ్వ విశాఖపట్నం వాస్తవ్యులు. ఆయన సుమారు 6 సంవత్సరాల క్రితం, అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన ‘ఎన్వేద బయో సైన్సెస్’ అనే ప్రధాన సంస్థతో కలిసి, ఒక యువ స్టార్టప్ వ్యవస్థాపకుడిగా ఈ సంస్థను స్థాపించారు. ఒక గొప్ప కార్యానికి ఎన్వేద థెరప్యూటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరపున అందించిన విరాళానికి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ విశ్వ తేజ కొల్లూరు గారికి మరియు సంస్థ యొక్క ఇండియా డైరక్టర్ విశ్వ తేజ తండ్రి గారు లయన్ సిఎన్ఎస్పి కృష్ణారావు గారికి హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వర రావు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే దాతల సహకారంతో మరిన్ని సదుపాయాలు హాస్పిటల్ నందు కల్పించి రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయటానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
