
విశాఖపట్నం, మార్చ్ 26 ఫ్లాష్ మెయిల్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంటర్ కాలిజియట్ మహిళల ఖోఖో పోటీలు ఏయూ గోల్డెన్ జూబ్లీ క్రీడా మైధానంలో గురువారం సాయంత్రం ముగిసాయి. విజేతలకు ఏయూ కోదండరామయ్య క్రీడా భవనంలో ఎపిఎస్ సి హెచ్ ఈ చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి, ఏయూ వీసీ ఆచార్య జీ.పీ రాజశేఖర్ విజేతలకు బహుమతి ప్రధానం చేసారు. ఖోఖో మహిళల ఇంటర్ కాలిజియట్ పోటీల్లో ప్రధమ స్థానంలో విజయనగరం జిల్లా కొత్తవలస ప్రగతి వ్యాయామ విద్యా కళాశాల, ద్వితీయ స్థానంలో విశాఖపట్నం డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల, తృతీయ స్థానంలో విశాఖ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల నిల్చాయి. ఈసందర్భంగా క్రీడాకారులను అధికార్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు, ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్, వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, డాక్టర్ లంకవల్లి బుల్లయ్య కళాశాల పి డీ డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా ఈ ఏడాది వివిధ క్రీడలు ఏయూలో నిర్వహించాంని
ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ వెల్లడి


విశాఖపట్నం, మార్చ్ 26 ఫ్లాష్ మెయిల్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా ఈ ఏడాది వివిధ క్రీడలు ఏయూలో నిర్వహించాంని ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ తెలిపారు. గురువారం మహిళల ఇంటర్ కాలిజియట్ ఖోఖో పోటీలు ఏయూ గోల్డెన్ జూబ్లీ క్రీడా మైధానంలో జరిగాయి. ఈ పోటీలను ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ గోల్డ్ మెడలిస్ట్, పోస్టల్ అధికారి ఎన్.కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ఎఫిలియేషన్ కళాశాలలు నుంచి వచ్చిన క్రీడాకారులను ప్రొఫెసర్ విజయ్ మోహన్ అభినందించారు. ఖోఖో పోటీల్లో అనిట్స్ కళాశాల, డాక్టర్ ఎల్బీకళాశాల, సత్యడిగ్రీ కళాశాల, జివివి ఇంజనీరింగ్ కళాశాల, ప్రగతి వ్యాయామ విద్యా కళాశాల, వివిధ కళాశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ గల క్రీడాకారులను ఏయూ ఇంటర్ యూనివర్శిటి జట్టుకు ఎంపిక అవుతారని ప్రొఫెసర్ విజయ్ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లంకవల్లి బుల్లయ్య కళాశాల పీడీ డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి, బి వి కె కళాశాల, విద్యా భవన్ పీడీ చక్రవర్తి, విశాఖ ఉమెన్స్ డిగ్రీ పీజీ కళాశాల లెక్చరర్ ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కిరణ్మయి, పి డీ సంధ్యారాణి, పి డీ మంగళగౌరి తదితరులు పాల్గొన్నారు.

