


విశాఖ ఎడ్యుకేషన్, మార్చ్ 5 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా ఏయూ ఉద్యోగులు, విద్యార్థులకు రంగోళీ పోటీలను నిర్వహించారు. ఏయూ పరిపాలనా భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ పోటీలలో ఏయూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. ఉత్సవాలు, నిత్యం పుస్తకాలు, ప్రయోగశాలల్లో గడిపే విద్యార్థులు కాస్త విరామం తీసుకుని అందమైన రంగ వల్లులను తీర్చిదిద్దారు. శతాబ్ది శోభను తీసుకువచ్చే విధంగా ఈ కార్యక్రమం సాగింది. కార్యక్రమంలో మెత్తం 50 మంది వరకు పాల్గొని ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ ఈ సందర్భంగా విద్యార్థులను, ఉద్యోగులకు అభినందించారు. శతాబ్ది మహిళా దినోత్సవం పురస్కరించుకునివినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మహిళా అభ్యున్నతి, వికాసాన్ని ప్రతిబింబిస్తూ రంగవల్లులు తీర్చిదిద్దడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రంగవల్లులను తిలకించి వాటిని తీర్చిదిద్దిన వారిని అభినందించారు. ఏయూ ఉపకులపతి సతీమణి జి.పావని స్వయంగా విద్యార్థులు వేసిన ముగ్గులను పరిశీలించారు. ఎంతో సృజనాత్మకంగా ఆలోచన చేస్తూ, మహిళా సాధికారతను ప్రతిబింబిస్తూ వీటిని తీర్చిదిద్దడం పట్ల విద్యార్థులను అభినందించారు. కార్యక్రమాన్ని మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ. పల్లవి సమన్వయం చేశారు. కార్యక్రమంలో లా కళాశాల ప్రిన్సిపాల్స్ ఆచార్య కె. సీతామాణిక్యం, ఆచార్య ఆర్. పద్మశ్రీ, ఆచార్య ఏం. శశి. డీన్లు కె.రమాసుధ, డి. లలిత భాస్కరి, ఆచార్య వి. వల్లీకుమారి, మేరీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
