ఆల్ ఇండియా ఇంట‌ర్ యూనివర్శిటీ బెస్ట్ ఫిజిక్ చాంపియ‌న్‌షిప్ పోటీలు ప్రారంభం….హాజ‌ర‌యిన 509 మంది క్రీడాకారులు….-పాల్గొంటున్న 115 విశ్వ‌విద్యాల‌యాలు….

క్రీడలు

విశాఖ ఎడ్యుకేషన్, మార్చ్ 3 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా ఆల్ ఇండియా ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ బెస్ట్ ఫిజిక్ చాంపియ‌న్‌షిప్ పోటీలు మంగ‌ళ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా ఈ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు. అర్జున అవార్డు గ్ర‌హీత నీలంశెట్టి ల‌క్ష్మి ముఖ్య అతిధిగా హాజ‌రై కార్య‌క్ర‌మాన్ని జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. అర్జున అవార్డు గ్ర‌హీత నీలంశెట్టి ల‌క్ష్మి మాట్లాడుతూ విభిన్న రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం వేదిక‌గా ఇటువంటి జాతీయ స్థాయి క్రీడా ఉత్స‌వం నిర్వ‌హించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. శ‌రీర ధారుఢ్య పోటీల‌కు హాజ‌రైన క్రీడాకారులు త‌మ పూర్తి సామ‌ర్ధ్యాల‌ను ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. ప‌త‌కాలు సాధించ‌డంతో పాటు క్రీడాస్ఫూర్తిని క‌లిగి ఉండ‌టం, మీ ప్ర‌యాణం ఇత‌రుల‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వ‌డం ఎంతో ప్ర‌ధాన‌మ‌ని సూచించారు. ఏయూ ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా వైవిధ్య‌మైన క్రీడ‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏయూకు మ‌రింత సంతోషాన్ని అదిస్తుంద‌న్నారు. ఇక్క‌డ‌కు వ‌చ్చిక క్రీడాకారుల క‌ఠోర సాధ‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌ను అభినందించాల‌న్నారు. ఇక్క‌డ‌కు వ‌చ్చిన ప్ర‌తీ క్రీడాకారుని అవిర‌ళ కృషిని గుర్తించి, ప్రోత్స‌హిస్తామ‌న్నారు. శ‌రీర ధారుఢ్యంతో పాటు మాన‌సిక సామ‌ర్ధ్యం కూడా ఎంతో ప్ర‌ధాన‌మ‌న్నారు. క్రీడ‌లో పాల్గొనే ప్ర‌తీ వ్య‌క్తి ఒక చాంపియ‌న్‌తో స‌మాన‌మ‌న్నారు. విజ‌యాన్ని సానుకూలంగా తీసుకుంటూ ముందుకు సాగాల‌న్నారు. అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌తో ఈ పోటీల‌ను నిర్వ‌హిస్తామ‌న్నారు. ఆత్మ‌స్థైర్యంతో ముంద‌డుకు వేయాల‌న్నారు. ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో ఇది ఒక అపురూప ఘ‌ట్టంగా నిలుస్తుంద‌న్నారు. ఏఐయూ అబ్జ‌ర్వ‌ర్ డాక్ట‌ర్ కౌక‌బ్ అజీమ్ మాట్లాడుతూ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ యూనివ‌ర్సిటీస్ ఆధ్వ‌ర్యంలో క్రీడ‌ల‌ను పూర్తిస్థాయిలో ప్రోత్స‌హిస్తోంద‌న్నారు. విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకోండి…అప‌జ‌యం నుంచి పాఠాలు నేర్చుకుని, విజేత‌లుగా మారండి అని హిత‌వు ప‌లికారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త క‌లిగి ఉండే విజ‌యం సాధ్య‌ప‌డుతుంద‌న్నారు. క్రీడాకారులు స‌హ‌నంతో త‌మ ప్రయాణాన్ని క‌లిగి ఉండాల‌న్నారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగ‌డం ఎంతో ప్ర‌ధాన‌మ‌న్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఆల్‌ ఇండియా యూనివర్శిటి బాడీ బిల్డింగ్ పురుషుల పోటీలు కు దేశ వ్యాప్తంగా 115 యూనివర్శిటీల నుంచి 509 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్శిటీల నుంచి 155 మంది జట్టు మేనేజర్స్, కోచ్ లు హాజ‌ర‌య్యారు. ఎనిమిది విభాగాల‌లో ప‌త‌కాల‌ను అందిస్తామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా అర్జున అవార్డు గ్ర‌హీత నీలంశెట్టి ల‌క్ష్మిని స‌త్కరించి, జ్ఞాపిక‌ను బ‌హూక‌రించారు. బాడీ బిల్డింగ్ అసోసియేష‌న్ అద్య‌క్షులు కె.గురునాధ రావు, ఏఐయూ అబ్జ‌ర్వ‌ర్ డాక్ట‌ర్ కౌక‌బ్ అజీమ్, విశాఖ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్ చీఫ్ పేట్ర‌న్‌ కె.వేణుగోపాల్‌, ఏయూ విశ్రాంత బాడిబిల్డింగ్ కోచ్‌ డాక్ట‌ర్ ఆర్‌.వి.ఎన్ ర‌త్నాక‌ర్ త‌దిత‌రుల‌ను స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మిస్ట‌ర్ ఆల్ ఇండియా ట్రోఫీని ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్‌, ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.సీతామాణిక్యం, ఎం.వి.ఆర్ రాజు, ప‌ద్మ‌శ్రీ‌, ప్రొఫెసర్ జాలాది రవి, క్రీడా విభాగాధిప‌తి ఆచార్య ఏ.ప‌ల్ల‌వి,profe ప‌లువురు డీన్‌లు అధికారులు,త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *