
విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: విశాఖ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 21 మేజర్ న్యూస్ : ఆంధ్రవిశ్వకళాపరిషత్ మరియు సమైక్య భారతి సంయుక్తంగా శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవసభ ఆంధ్రవిశ్వకళాపరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సభకు సభాధ్యక్షులు తెలుగుశాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ తెలుగు భాషను అంతర్జాతీయ మాతృభాషగా గుర్తించడమే మన లక్ష్యమని అన్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేయాలని అన్నారు. తెలుగు భాష విశిష్టత గురించి ఆచార్య జర్రా అప్పారావు కొనియాడారు. విశిష్ట అతిథి నల్ల సత్యనారాయణ హిందీ శాఖాధిపతి మాట్లాడుతూ తెలుగు భాష సాహిత్యం గురించి చెప్తూ పురోభవృద్ధిలో ఉండే దేశాలైన అమెరికా, జపాన్ దేశాలు మాతృభాషలోనే బోధన జరుపుకుంటున్నాయి.భాష వృద్ధి కోసం రోజువారి వినియోగంలో మాతృభాషను భాగం చేసుకోవాలి అని సూచించారు. విశిష్ట అతిథి ఆంగ్ల శాఖాధిపతి ఆచార్య సోలమేన్ బెన్ని మాట్లాడుతూ మాతృభాషలో ప్రావీణ్యం సాధిస్తే ఇతర భాషలో జీవనశైలిలో నైపుణ్యం సాధించవచ్చు అని చెప్పారు.నేడు భాష ఉచ్చారణ మార్పు వలన అసలైన భాష స్వరూపం కోల్పోతున్నాం అని పేర్కొన్నారు. విశిష్ట అతిథి గ్రంథాలయాధిపతి ఆచార్య వి. ధనరాజ్ మాట్లాడుతూ నిజమైన భావ ప్రకటన మాతృభాషలో జరుగుతుందని చెప్తూ తెలుగు సాహిత్య విశిష్ఠత గురించి తెలిపారు.భాష క్షీణించకుండా కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది అని తెలిపారు. తెలుగుశాఖ గౌరవ ఆచార్య గజ్జ యోహాను బాబు మాట్లాడుతూ తెలుగు భాషకు బ్రిటిష్ వారి సేవలు గురించి ప్రస్తావిస్తు ప్రపంచ దేశాలలో మాతృ భాషలకు ఇచ్చే ప్రాధాన్యత మన దేశంలో ఉండే భాషలకు కూడా ఉండాలని చెప్పారు.
శతాధిక గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ ప్రపంచంలో అనేక రకాల యుద్ధాలు జరిగాయన్నారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు ఏం . మౌనిక,కె .తరుణ్ కుమార్, కె .రవికుమార్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు కె .సురేఖ, ఆర్ .వరలక్ష్మి బి .చందు వీరు తెలుగు భాష ప్రాధాన్యత గురించి తమ ప్రసంగాల్లో విన్నవించారు. హిందీ విభాగం నుంచి వెంకన్న బాబు, వికాస్,సాయి సుస్మిత, సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి రవి శంకర్ తమ ప్రసంగాలు వినిపించారు. ఈ సభకు పి . స్నేహలత స్వాగతం పలకగా బి.ఆశ వందన సమర్పణ చేశారు.ఈ సభలో అతిథి అధ్యాపక బృందం ఏం. దాసు , ఏం. ప్రతాప్ , .సూర్యనారాయణ,ఆచార్యులు,పరిశోధకులు, విద్యార్థులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు
