
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాధిపతిగా ఆచార్య డి. లలిత భాస్కరి నియమితులయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ కార్యాలయంలో సంబంధిత ఉత్తర్వులను ఆచార్య డి. లలిత భాస్కరికి అందించి శుభాకాంక్షలు తెలియజేసారు.
కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతిగా ఆచార్య వి.వల్లి కుమారి
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతిగా ఆచార్య వి.వల్లి కుమారి నియమితులయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ నేడు అయన కార్యాలయంలో సంబంధిత ఉత్తర్వులను ఆచార్య వి. వల్లి కుమారి కి అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

డ్యామ్ సేఫ్టీ కమిటి సభ్యునిగా ఆచార్య సత్యనారాయణ రెడ్డి
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరుల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్యామ్ సెఫ్టీ కమిటీ సభ్యునిగా ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు, జియో టెక్నికల్ నిపుణుడు ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య సత్యనారాయణ రెడ్డిని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో అభినందించారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 అనుసరించి నూతనంగా ఈ కమిటిని ఏర్పాటు చేశారు. హైడ్రాలజీ, డ్యామ్ సేఫ్టీ రంగానికి చెందిన ముగ్గురు ఆచార్యులను ఈ కమిటీలో నియమించారు. వీరిలో ఒకరు ఆచార్య సత్యనారాయణ రెడ్డి కాగా మిగిలిన ఇద్దరిని ఐఐటి చెన్నయ్ కి చెందిన ఆచార్యులను నియమించారు.

