

విశాఖ ఎడ్యుకేషన్,ఫిబ్రవరి 12 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విద్యార్థులు క్రిడల్లో పాల్గొనడం వలన ఉత్సాహాన్ని ఇస్తాయని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపి రాజశేఖర్ అన్నారు. గురువారం ఏయూ క్రీడామైదానంలో ఆట్టహాసంగా సెంటనరీ క్రికెట్ పైనల్ పోటీలు జరిగాయి. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ క్రికెట్ పోటీల్లో విజేతలకు ప్రైజ్ మానిని స్పాన్సర్ అందించి న వారికీ అభినందనలు తెలిపారు. ఈ ఫైనల్ పోటీలు డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలకు జిడిసీ గుమ్మ లక్ష్మీ పురం కు జరిగాయి. టాస్ బుల్లయ్య కళాశాల టాస్ గెల్చి ఫీల్డింగ్ ను ఎన్నుకుంది. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (జిడిసి) బ్యాటింగ్ దిగి 10 ఓవర్లు ఆడి 5 వికెట్లు నష్టానికి 56 పరుగులు చేసారు. అనంతరం బ్యాటింగ్ దిగిన డాక్టర్ బుల్లయ్య కళాశాల జట్టు 10 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసారు. ఈ మ్యాచ్ డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల ఏయూ శాతాబ్ది క్రికెట్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. ఉదయం డాక్టర్ ఎల్ బి కళాశాలకు ఎంవీఆర్ కాలేజీ కి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో డాక్టర్ ఎల్ బి కళాశాల విజేతగా నిల్చింది. మరో మ్యాచ్ గుమ్మ లక్ష్మీ పురంకు ఎంవీఆర్ కాలేజీ కి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుమ్మలక్ష్మీపురం జీడీసీ విజేతగా నిల్చి ఫైనల్స్ చేరింది. పైనల్స్ లో డాక్టర్ బుల్లయ్య కళాశాల నిల్చింది. మూడవ స్థానం జాయింట్ విన్నర్స్ గా ఎఎంఎల్ కళాశాల, ఎంవిఆర్ కళాశాల నిల్చాయి. వీరికి వైస్ ఛాన్సలర్ 30 వేల రూపాయలు చొప్పున ప్రైజ్ మణీని అందించారు. అలాగే విన్నర్స్ బుల్లయ్య కళాశాలకు లక్షరూపాయలు, రన్నర్స్ గుమ్మలక్ష్మీపురం జిడీసీ కి 50 వేల రూపాయలు ప్రైజ్ మణీని అందించారు. ఈ ప్రైజ్ మణీ స్పాన్సర్స్ యుఎస్ఎ నరవనేని సత్యంబాబు 3 లక్షల రూపాయలు తాతినేని గోపీ 2 లక్షల రూపాయలు అందించగా సెంటనరీ క్రికెట్ పోటీలుకు వినియోగించినట్లు ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ తెలిపారు. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల సెక్రటరీ డాక్టర్ జి. మధుకుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ జి.ఎస్.కె. చక్రవర్తి. ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, చీఫ్ సెక్ర్యూరిటీ ఆఫీసర్ ప్రొఫెసర్ ఆశా ఇమ్మానియాల్ రాజ్, ప్రొఫెసర్ యుగంధర్, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ లక్ష్మరెడ్డి, ఎఎంఎల్ కళాశా కళాశాల పీడీ డాక్టర్ నాయుడు, ఎంవిఆర్ కళాశాల పీడీ రవికుమార్, పీడీ శ్రీకాంత్, పరిశోధకులు, ఎంపీఈడీ విద్యార్థులు ఆఫీసియల్స్ జి. అప్పారావు, లోకేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.చీఫ్ సెక్ర్యూరిటీ ఆఫీసర్ ప్రొఫెసర్ ఆశా ఇ మ్మానియాల్ రాజ్, ప్రొఫెసర్


