క్రీడల్లో ప్రతిభా వంతులకు మంచి గుర్తింపు ప్రిన్సిపల్ ఆచార్య కె. సీతామాణిక్యం

క్రీడలు

విశాఖఎడ్యుకేషన్, డిసెంబర్ 12 : క్రీడల్లో ప్రతిభా వంతులకు మంచి గుర్తింపు ఉంటుందని. ఏయూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ ఆచార్య కె.సీతామాణిక్యం వెల్లడించారు. శుక్రవారం ఏయూ న్యూ జిమ్నాజియంలో బ్యాట్మెంటన్ పురుషులు, మహిళలు ఇంటర్ కాలేజిట్ పోటీల్లో వివిధ కళాశాలల విజేతలకు ముఖ్యఅతిథిగా పాల్గొని బహుమతి ప్రధానం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సాహం ఇస్తుందని, ఉద్యోగాల్లో కూడా ప్రతిభ గల క్రీడాకారులకు రిజర్వేషన్ కల్పించిందన్నారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ యూనివర్శిటీ బ్యాట్మెంటన్ ఎంపికలు పురుషులు విభాగంలో మహిళలు విభాగంలో ఎంపికలు కొనసాగు తున్నాయన్నారు. ఈసందర్భంగా క్రీడాకారులను అభినందించారు. ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు పురష్కరించుకుని ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ క్రీడాకారులు అందరికీ భోజన సదుపాయం, కల్పించడం జరుగుతుందని తెలిపారు. యూనివర్శిటీ జట్టుకు ఎంపికయిన క్రీడాకారులు, మేనేజర్కు కోచ్ లకు కూడా డి.ఎ ను యూనివర్శిటి అధికార్లు పెంచారని 3 ఈసందర్భంగా అభినందనలు తెలిపారు. విజేతలకు ప్రిన్సిపాల్ ఆచార్య కె. సీతామాణిక్యం చేతులు మీదుగా బహుమతి ప్రధానం చేసారు. పురుషులు విభాగం ఇంటర్ కాలిజియట్ లో ప్రధమ స్థానంలో యలమంచిలి. గురజాడ అప్పారావు డిగ్రీ కళాశాల, ద్వితీయ స్థానంలో విశాఖపట్నం డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల. తృతీయ స్థానంలో తగరపు వలస అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల నిల్చాయన్నారు. మహిళలు విభాగంలో విశాఖపట్నం ఏ.వి.ఎన్. కళాశాల, ద్వితీయ స్థానంలో తగరపవలన అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, తృతీయ స్థానంలో వాసవి కాలేజ్ ఆఫ్ ఫార్మశీ నిల్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ శివ, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల వ్యాయామ విద్యావిభాగం హెడ్ డాక్టర్ వై శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్లు, తోపాటు క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *