
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 22 : ఆంధ్ర విశ్వవిద్యాలయం వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 16, 17 తేదీలలో జాతీయ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ కు సంబంధించిన పోస్టర్ ను ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ ఈరోజు విడుదల చేశారు. పర్యావరణ- అటవీ- క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ రెండు రోజుల వర్క్ షాప్ కు సహకారం అందిస్తున్నాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రీజర్వింగ్ ద ప్లానెట్స్ గ్రీన్ హెరిటేజ్- ద రోల్ ఆఫ్ ప్లాంట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనే అంశంపై ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. పీజీ విద్యార్థులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు ఈ వర్క్ షాప్ లో పాల్గొనవచ్చు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం వి ఆర్ రాజు, విభాగాధిపతి ఆచార్య డి. సంధ్యా దీపిక, వర్క్ షాప్ సమన్వయకర్త ఆచార్య ఎస్.బి పడాల్, విభాగ ఆచార్యులు ఆచార్య పి.కె రత్నకుమార్, డాక్టర్ పి. బలరామ స్వామి యాదవ్, డాక్టర్ ఎస్ వి వి ఎన్ దొర, డాక్టర్ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
