
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 11 : ఏ యూ ఇంటర్ కాలేజీట్ బ్యాట్మెంటిన్ పోటీలును ఏ యూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ గురువారం ప్రారంభించారు. ఏయూ వ్యాయామ విద్యా విభాగం న్యూ జిమ్నజియం లో ఇంటర్ కాలిజియట్ పురుషులు, మహిళలు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక కు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా క్రీడాకారులను అభినందించారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహహన్ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని క్రికెట్ పోటీలు త్వరలో నిరవ హిస్తామని తెలిపారు. విద్యార్థుల కు ప్రాక్టికల్ పరిక్ష లు ఉన్నందున క్రికెట్ పోటీలు వాయిదా వేసామన్నారు. ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ లక్షిణరెడ్డి, పి. ఈ టీ శివ, ఏ యూ గెస్ట్ ఫాకలిటి డాక్టర్ దిలీప్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
