
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 18 : గాయత్రి విద్యాపరిషత్ డిగ్రీ మరియు పీజీ కళాశాల (అటామనస్) గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఈనెల 20వ తేదీ నిర్వహిస్తున్నట్టు గాయత్రి విద్యా పరిషత్ ఉపాధ్యక్షులు డి. దక్షిణామూర్తి, సభ్యులు ఆచార్య పి రాజు గణపతి తెలిపారు. ఈ మేరకు గురువారం గాయత్రి కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గాయత్రి కళాశాల ఋషికొండ క్యాంపస్ లోని సెంట్రల్ ఆడిటోరియంలో డిసెంబర్ 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు డిగ్రీ ప్రదానోత్సవం’ ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ డిగ్రీల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్సీహెచ్ఈ ) చైర్మన్ ఆచార్య మధు మూర్తి హాజరవుతున్నట్టు తెలిపారు. తమ గాయత్రి కళాశాల లో 2023వ సంవత్సరం లో పాసయిన యూజీ, పీజీ కోర్సుల మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ స్నాతకోత్సవ సభలో డిగ్రీలను ప్రదానం చేయనున్నామని చెప్పారు. డిగ్రీ కోర్సుల నుండి ఎనిమిది మందికి, పీజీ కోర్సుల నుండి ఒకరికి మొత్తం తొమ్మిది బంగారు పతకములు, అధికశాతం మార్కులతో ఉత్తీర్ణులయిన మొదటి అయిదుగురు విద్యార్ధులకు ప్రశంసా పత్రములతో పాటూ అర్హులయిన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయడం ప్రధాన లక్ష్యం గా ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా పరిషత్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.యస్. బోస్, జీవీపీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎ. సాయి రూప్,పాల్గున్నారు. పీఆర్ఓ డి. పద్మజ ఇతర అధ్యాపక బృందం డాక్టర్ లక్షినారాయణ పాల్గొన్నారు. మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ : గణితంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి తన భర్త జ్ఞాపకార్థం శ్రీమతి జి. అన్నపూర్ణ స్థాపించిన డాక్టర్ జి.వి.ఎల్. నరసింహం స్మారక పతకం. శాస్త్రాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి తన భార్య జ్ఞాపకార్థం సిరి. మనప్రగడ సూర్యనారాయణ స్థాపించిన శ్రీమతి మనప్రగడ రామ శేషమ్మ స్మారక మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్. తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన తన భార్య జ్ఞాపకార్థం శ్రీమతి మనప్రగడ రామ శేషమ్మ స్మారక మెడల్ ఆఫ్ While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.rolexreplicaswissmade.com/Watches/Daytona.php. I also noted another reference for later: https://www.rolexreplicaswissmade.com/Watches/Daytona.php.ఎక్సలెన్స్‌ను శ్రీ మనప్రగడ సూర్యనారాయణ స్థాపించారు. MBA లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి Dr. ఎ.జి. ప్రసాద్ మరియు శ్రీమతి రామ లక్ష్మి స్థాపించిన ప్రొఫెసర్ భావరాజు సర్వేశ్వరరావు స్మారక మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్. BBA లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి శ్రీ కాసిం ఎస్. మెహదీ స్థాపించిన మోహ్సిన్ బ్రదర్స్ ఫౌండేషన్ స్మారక మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్. లైఫ్ సైన్సెస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి తన తండ్రి జ్ఞాపకార్థం శ్రీ. డి.పి.ఎస్.మూర్తి స్థాపించిన శ్రీ. దిట్టకవి వెంకట శేషగిరి రావు స్మారక మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్. కెమిస్ట్రీలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థికి తన తల్లి జ్ఞాపకార్థం ప్రొఫెసర్ పి. రాజా గణపతి శ్రీమతి ప్రగడ లలిత కుమారి స్మారక మోడల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశారు. భౌతిక శాస్త్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి శ్రీమతి మనప్రగడ అంజనా దేవి స్మారక మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను శ్రీ మనప్రగడ వెంకటేశ్వరులు తన భార్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. శ్రీ. మానప్రగడ వెంకటేశ్వర్లు మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ ,పరీక్షల కంట్రోలర్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ పీజీ కోర్సులు. వాణిజ్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి అందజేస్తారు
