జాతీయ సదస్సుకు విశిష్ట అతిథిగా ఏ యూడాక్టర్ అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్

ఎడ్యుకేషన్

విశాఖఎడ్యుకేషన్, నవంబర్24 : ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ మేకా జేమ్స్ స్టీఫెన్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘డాక్టర్ అంటేడ్కర్ ఫౌండేషన్’ ఆయనను అధికారికంగా ఆహ్వానించింది. 2025 నవంబర్ 26న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరగనున్న ప్రతిష్టాత్మక జాతీయ సదస్సులో ఆయన ‘విశిష్ట అతిథి గా పాల్గొని, ప్రసంగించడమే కాకుండా ఒక ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చకు అధ్యక్షత వహించనున్నారు. భారత రాజ్యాంగ ఆమోదపు 75 సంవత్సరాల వేడుకల (సంవిధాన్ 75) ముగింపు సందర్భంగా ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.ఆర్. గవాయ్, సామాజిక న్యాయం సాధికారత శాఖ కేంద్ర మంత్రి డి ఏ ఆఫ్ చైర్మన్ వంటి అత్యున్నత రాజ్యాంగ ప్రభుత్వ ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రొఫెసర్ స్టీఫెస్ పంపిన అధికారిక లేఖలో డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ఇలా పేర్కొంది. డిజిటల్ టెక్నాలజీలో మీ నైపుణ్యం, సామాజిక సాధికారతకు మీరు అందిస్తున్న దీర్ఘకాలిక సేవలు దేశాభివృద్ధి పట్ల మీకున్న దూరదృష్టికి గుర్తింపుగా మిమ్మల్ని ఈ దారిత్రాత్మక కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సదస్సులో ప్రసంగించి, ప్యానల్ చర్చకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నామని లేక లో తెలిపారు. జాతీయ వేదికపై ప్రొఫెసర్ స్టీఫెన్ ఎంపిక కావడం ఆంధ్రవిశ్వవిద్యాలయానికి, ముఖ్యంగా పరిశోధన విధానపరమైన అంశాలలో జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చైర్ కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖ న్యాయకోవిదులు ఉప కులపతులతో వేదికను పంచుకోవడం ఒక స్ఫూర్తిదాయకమైన అవకాశం అని ప్రొఫెసర్ స్టీఫన్ పేర్కొన్నారు. దీనివల్ల డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, రాజ్యాంగ అక్షరాస్యత సామాజిక సాధికారత వంటి అంశాలలో ఏయూ చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల నుండి మరియు డాక్టర్ అంబేడ్కర్ చైర్ల నుండి సుమారు 700 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *