ప్రమాణాలను నిర్ధారించడం, అనుసరించడం అవసరం.. -ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 22 : ప్రమాణాలను నిర్ధారించడం, అనుసరించడం, సమర్ధవంతంగా అమలు చేయడం ఎంతో అవస రమని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో శుక్రవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) విద్యార్థి విభాగం ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాణాలను నిలుపుకుంటేనే ప్రగతి సాధ్యపడుతుందన్నారు. ఆభరణాలకు సైతం ప్రమాణాల ను నిర్ధారించి, అమలు చేస్తున్న విధానాన్ని వివరించారు. సాంకేతికత అనుసంధానిత స మాజంలో మనం జీవనం సాగిస్తున్నామన్నారు. మనం వినయోగించే వస్తువులలో ప్ర మాణాలు లేని వాటిని గుర్తించి, వాటికి ప్రమాణాలను సిద్ధం చేసే విధంగా యువత కృషి చేయాలన్నారు. విద్యార్ధుల ఆధ్వర్యంలో త్వరలో సదస్సు నిర్వహించాలన్నారు. వైద్య రంగ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ రంగానికి అవసరమైన ఉపకరణాలలో ప్రమాణాలు పాటించడం ఎంతో అవసరమన్నారు. ప్రతి విభాగంలో విభాగ పరిశోధకుల దినోత్సవాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఆయా రంగాలలో నిష్ణాతులను ఆహ్వానించి, పరిశోధకులు స్ఫూర్తిని, మార్గనిర్దేశాన్ని చూపే విధంగా కార్యక్రమాలు చేయాలన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య పి. కింగ్ మాట్లాడుతూ విభిన్న వ్యవస్థలలో ప్రమాణాల ను రూపొందించి అమలు చేసే వ్యవస్థగా బిఐఎస్ పనిచేస్తోందన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల ను నివారించాలంటే ఖచ్చితంగా ప్రమాణాలను అనుసరించడం అవసరమన్నారు. అదే సమ యంలో రెగ్యులేటరీ వ్యవస్థలు సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. విద్యార్థులు తాము పనిచేసే సంస్థలో వినియోగించే పరికరాలు, యంత్రాలపై అవగాహన కలిగి ఉండాల న్నారు. ప్రమాణాల విలువను గుర్తించాలని సూచించారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. శశిభూషణ రావు మాట్లాడుతూ విద్యార్ధులకు అవగాహన పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. సదస్సు సమన్వ యకర్త, విభాగాధిపతి ఆచార్య వి.శ్రీదేవి మాట్లాడుతూ అత్యుత్తమ ప్రగతికి ప్రమాణాలే పునాదులుగా నిలుస్తాయన్నారు. పీపర్, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను విద్యార్థులకు నిర్వ హిస్తున్నామన్నారు. కార్యక్రమం ఆచార్య పి. వెంకట రావు వందన సమర్పణతో ముగిసింది. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *