37 వార్డులో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ షెడ్ ను ప్రారంభించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్….1,39,000( లక్షా ముప్పై తొమ్మిది వేలు) నిధులతో ఆలయ షెడ్ నిర్మాణం పూర్తి …..

ఆంధ్రప్రదేశ్‌

VisakhaPatnam, November 17: 37 వార్డులో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం షెడ్ ను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే   వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రారంభించారు స్థానిక ప్రజల వినతి మేరకు సుమారుగా 1,39 వేల రూపాయలతో షెడ్ నిర్మాణం చేపట్టి నవంబర్ 17 న  ప్రారంభించారు. గత ఎన్నో ఏళ్లుగా ఆలయ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన వెంటనే పూర్తి చేసినందుకు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్   స్థానిక ప్రజలు జేజేలు పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్  మాట్లాడుతూ నిరంతరం నియోజవర్గం అభివృద్ధి కోసం తన సొంత నిధులతో పాటు ప్రభుత్వం నుంచి కూడా అనేక విధాలుగా అభివృద్ధికి నిధులు వేచ్చిస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అనేక పనులు పూర్తి చేసిన విషయాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివప్రసాద్ రెడ్డి , అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు, యువత , స్థానిక కూటమి నేతలు  శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంఘం కార్యవర్గం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *