రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని కలిసి వాడబలిజ మత్స్యకార కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి… తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు వాడబలిజ మత్స్యకార నాయకులు తిత్తి సాయి బలరాం

Uncategorized ఆంధ్రప్రదేశ్‌

విశాఖపట్నం, మార్చ్ 5 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: మార్చ్ 5 సాయంకాలం విశాఖ నగర ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని విశాఖ విమానాశ్రయం లో కలిసి రాష్ట్రంలో సముద్రతీరా ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన వాడబలిజ మత్స్యకార కులానికి చెందిన వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తద్వారా వాడబలిజ కులస్తులకు ప్రభుత్వం ద్వారా సంక్షేమం అభివృద్ధి పూర్తిస్థాయిలో అందుతుందని తద్వారా కులము యొక్క అభివృద్ధి జరుగుతుందని దీనికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు వాడబలిజ మత్స్యకార నాయకులు తిత్తి సాయి బలరాం శ్రీ నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *