Visakhapatnam, November 18: మహిళ భద్రతకు ప్రజలంతా కలిసి పనిచేయాలి. మహిళల భద్రత కల్పన కేవలం ఒక వ్యక్తిపైన వ్యవస్థపైన ఆధారపడి ఉండదని, వారి భద్రతకోసం అందరూ సమిష్టిగా పనిచేయాల్సిన అవ సరం ఉందని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఏయూలో మంగళవారం మద్యాహ్నం సస్టైనింగ్ విమెన్ సిస్ట్ బెంచ్మర్కింగ్ విశాఖప ట్నంమ్స్ సక్సస్ అండ్ ఫ్యూదర్ ప్రూపింగ్ గవర్నెన్స్ అంశంపై రాష్ట్ర మహిళా కమీషన్, ఏయూ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన సద స్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో మహిళా భద్రతపై నిర్వ హించిన నారీ 2025 ఇండెక్స్లో జాతీయ స్థాయిలో విశాఖ నగరం ప్రదము స్థానంలో నిలిచిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
విశాఖ నగరం మహిళా భద్రతకు ఎంతో సురక్షితంమైన నగరంగా నిలవడం పట్ల ఆమె అభినందించాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం విశాఖ ఎంతో సేప్ సిటీ అని అనేక సందర్భాలలో చెప్పారన్నారు. మహిళా బద్రత కోసం విశాఖలో అమలు చేస్తున్న విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా బద్దత ఒక చర్చించే అంశం కాదని, అనేక మంది మహిళల బాధ దాని వెనుకు ఉంటుంధన్నారు. విశాఖకు నేడు జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం ఎంతో గర్వకారణమైన విషయమని. భవిష్యత్తులో సైతం ఇదేవిధమైన వ్యవస్థను అమలు చేసే విధంగా విధానాలు ఉండాలన్నారు. అధికారులను నేరుగా చేరుకుని ఫిర్యాదు చేసి భరోసా మహళలకు కల్పించడం ఎంతో అవసర మని, ఇది వారికి ఎంతో దైర్యాన్ని కలిపిస్తుందన్నారు. అత్యుత్తమ విదానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. నేడు విశాఖ మహిళలకు సురక్షిత నగ రంగా నిలవడం వెనుక అధికారుల కృషి, వారు తీసుకుంటున్న చర్యలు ఎంతో దోహదప డ్డాయన్నారు. పోప్ చట్టం, ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటి (ఐసిసి) లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. ఈ దిశగా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. ఐసీసీలో అంతర్గత సమ్యలతో పాటు, బయల వ్యక్తుల ను సభ్యులుగా ఏర్పాటు చేయడం ఎంతో మంచిదన్నారు. యుక్తవయస్సులో ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెటుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న పలు స మస్యలను వివరించారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ భద్రత అంటే కేవలం శారీరక బద్ధత అందించడమే కాదని, సామాజిక, ఆర్ధిక, ఆరోగ్య బద్రత కూడా కల్పించడం ఎంతో అవసరమ న్నారు. విద్యతోనే ప్రతీ మహిళకు పూర్తి స్థాయిలో బద్రత, భరోసా లభిస్తాయన్నారు. ప్రతీ చిన్నారి పాఠశాలకు వెళ్లే విధంగా చూడటం, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే విదంగా చూడాల్సిన అవసరమన్నారు. శిశుమరణాలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టపర మైన న్యాయ సహాయం అందించడం కూడా బద్రతలో భాగమేనన్నారు. వృద్ధులను గౌర. వంగా జీవించే విధంగా పెన్షన్ చేస్తోందన్నారు. యువతను, ముఖ్యంగా అబ్బాయిల పెంపకంలో ఎంతో బాధ్యతగా తల్లి దండ్రులు ఉండాలన్నారు. మహిళలను గౌరవించడం వారికి నేర్పాలన్నారు. మహిళా సాధికారతకు ముందడుగు వేసే విధంగా స్త్రీ శక్తి పథకం నిలుస్తోంద న్నారు. వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేసామని, మహిళలు ఎదుర్కొనే ఎటువంటి సమస్య నైనా ఇక్కడ తగిన సూచనలు, సలహాలు, సహాయం అందించడం జరుగుతుందన్నారు. వ ర్కింగ్ విమెన్స్ హాస్టల్స్ ని మూడు ప్రాంతాలలో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించడం జరుగుతోందన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ మహిళావిద్యార్థినులకు బద్రత కల్పించే విధంగా ఏయూలో తొలిసారిగా మహిళా సెక్యూరిటీ గార్డ్ని నియమిందామన్నారు. ఆరోగ్య వంతమైన సమాజం మహిళా బద్ధతతోనే సాకారం అవుతుందన్నారు. మహిళా గ్రీవెన్స్ సెల్ ఏయూ క్యాంపస్తో పాటు, అనుబంధ కళాశాలలకు సైతం సేవలు అందిస్తోందన్నారు. విద్యార్థి విభాగంలో ప్రత్యేకంగా అసోసియేట్ డీన్ మహిళను నియమించడం, మూడు కీలక మైన డీన్ పదవుల్లో, ఏయూ క్యాంపస్ లోని మూడు కళాశాలలకు ప్రిన్సిపాల్స్ గా మహిళల ను నియమించి ఏయూలో వీరికి సంపూర్ణ ప్రోత్సాహం అందించడం జరుగుతోందన్నారు. సేఫ్ క్యాంపస్ గా ఏయూను నిలుపుతున్నామన్నారు. త్వరలో ఒక అధ్యయనం చేసి పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. మహిళలు మౌనాన్ని వీడి స్వేచ్ఛగా తమ సమస్యను, సవాళ్లను వెల్లడించాలన్నారు. పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ ప్రతీ కార్యాలయంలో మహిళల బద్రత కల్పించే ప్రత్యేక కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. తద్వారా పాష్ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలే పోలీసులకు కళ్లు, చెవులుగా నిలుస్తున్నాయన్నారు. నగరంలో శాంతి బద్రతల సమస్యలు వస్తాయని, విఘాతం క లుగుతుందని అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మహిళలు పోలీసు స్టేషన్ కి వెళ్లడానికి కొంత ఆలోచిస్తారని, అందుకే ప్రత్యేకమైన ఫోన్ నంబర్ అందించి ఎప్పుడైనా తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పించామన్నారు. ఆన్ లైన్ నేరాలు, వేధింపులు మహిళలపై అధికంగా జరుగుతున్నాయన్నారు. మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావాలన్నారు. సమస్య ఎదురైన సందర్భాలలో దైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ. పల్లవి సదస్సు నిర్వహణ, ప్రాధాన్యతను వివరించారు. మహిళా బద్రతకు తమ నిబద్ధతను చాటే విధంగా ఈ కార్యక్రమం నిలు స్తుందన్నారు. ఇది కేవలం ఒక నగరానికి లభించిన గుర్తింపి కాదని, రాష్ట్రానికి లభించిన గౌరవమన్నారు. ముందుగా దుర్గాబాయి దేశముఖ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అతిధులకు జ్ఞాపికలు బహూకరించి, సత్క రించారు. కార్యక్రమంలో ఏయూ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధికారులు, ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
