ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం…. మంత్రులు, అధికారుల టీం వర్క్ తోనే సమ్మిట్ సూపర్ హిట్….విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు అనంతరం మంత్రులు, అధికారులు, ఉద్యోగులకు సీఎం అభినందన అవార్డులు అందించి… ప్రశంసించిన సీఎం

ఆంధ్రప్రదేశ్‌
Visakhapatnam, November  15 : విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు లో ఈ సందర్భంగా ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సీఐఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సును జయప్రదం చేసిన ప్రతి ఒక్కరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.   45 దేశాల్లో మన సమ్మిట్ చర్చనీయాంశమైందంటే, విశాఖ పేరు మార్మోగుతోందంటే టీం వర్క్ తోనే ఇది సాధ్యమైంది. ఈ సదస్సులో అర్ధవంతమైన, విజ్ఞానవంతమైన చర్చలు జరిపాం,  దావోస్  ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు లో ఎంవోయూలు బయట జరుగుతాయి. ప్రపంచం ఏ దిశగా ముందుకు వెళుతోంది, భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, ఎదురయ్యే సవాళ్లు, అందివచ్చే అవకాశాలపై మెయిన్ వెన్యూలో చర్చిస్తారు. కానీ వినూత్న పద్ధతిలో విశాఖ సమ్మిట్ కు మనం శ్రీకారం చుట్టాం. ఎవరికి ఏ సబ్జెక్ట్ పైన ఆసక్తి ఉంటే ఆ సెమినార్ కు వెళ్లే అవకాశం కల్పించాం. సమ్మిట్ లో వెన్యూ మొదలుకొని మెనూ వరకూ అంతా ప్లానింగ్ తో నిర్వహించారు. విదేశీ ప్రతినిధులను ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకూ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించింది.  ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. మోదీ బలమైన నాయకుడు అనే భావన ప్రపంచమంతా ఉంది. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, పెట్టుబడులు పెట్టొచ్చనే ధైర్యాన్ని పారిశ్రామికవేత్తల్లో కలిగించారు.  2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. విధ్వంస పాలనకు చరమగీతం పలికారు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు.  ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *