Flashmailnewsmedia
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 15 : ఆంధ్రాయూనివర్శిటీ డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ ఆధ్వర్యం లో మహిళల భద్రత సాధనలో విశాఖపట్నం విజయాలను నిలబెట్టడం భవిష్యత్ పరిరక్షణ పరిపాలనకు మార్గదర్శకం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తో కలిసి ఉన్నత స్థాయి సదస్సును నిర్వహించనున్నామని డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఎ.పల్లవి తెలిపారు. ఈనెల 18 వ తేదీ న ఆంధ్రాయూనివర్శిటి లో ఉన్న శ్రీ రామినేని కోదండరామయ్య సెమినార్ హాల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజీ ఆఫ్ లా ఎదురుగా ఉన్న ఈ భవనంలో సదస్సు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుందన్నారు.చీఫ్ గెస్ట్ లు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజా, ఏయూ వీసీ ఆచార్య జి.పీ రాజశేఖర్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్ ఐఎఎస్, విశాఖ ఐఎఎస్, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖ పట్నం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ శంకబ్రత బాగ్చి, తోపాటు తదితర అధికార్లు పాల్గొంటారన్నారు.ఈ సదస్సులో మహిళల భద్రత పై జాతీయ వార్షిక నివేదిక, సూచీ ఎన్ఎఆర్ఐ 2025 లో విశాఖపట్నం దేశ వ్యాప్తంగా మొదటి స్థానాన్ని సాధించడం మహిళల భద్రత, పట్టణ పరిపాలనకు ఒక జాతీయ ప్రమాణంగా నిలిచింది. ఈసదస్సు విశాఖపట్నం విజయయాన్ని పునరావృతం చేయదగిన విధాన ఆధారిత నమూనాగా మార్చడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా విధాన నిర్నేతలు,పరిపాలకులు చట్ట అమలు సంస్థలు, విద్యావేత్తలు పట్టణ ప్రణాళిక నిపుణులు, కలిసి నగరం లో సాదించిన విజయాలను సంస్థాగ తీకరించడానికి అవసరమైన ప్యూహాలను చర్చించనున్నారని తెలిపారు. చర్చించబడే ముఖ్యాంశాలు మహిళల భద్రతకు అనువైన పరిపాల నా వ్యవస్థలను సమూనాలను బలోపేతం చేడయం, ఆచరణ సాధ్యమైన, పునరావృతం చేయగల భద్రతా రూపొందించడం. వివిధ సంస్థలు పట్టణ యంత్రాంగాల్లో వేగవంతమైన అమలుకు మార్గాలు సూచించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సహాకారం తో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు.