30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరై ప్రసంగించిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్,గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్,సి. ఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్‌
విశాఖపట్నం: భారత ఉపరాష్ట్రపతి  సీపీ రాధాకృష్ణన్  ప్రసంగం లో    ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్ధికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోంది.  సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుంది.  ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తోంది.  అభివృద్ధికి – సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు రోల్ మోడల్.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారు .  ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు సాధించడానికి చంద్రబాబు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులను ఒప్పిస్తున్నారు.  విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను .దేశం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తున్నాయి,  జీఎస్టీ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి దేశాభివృద్ధి దోహదం చేస్తున్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ  అగ్రి ఎకనామి ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయి,  ఇ-గవర్నెన్సు, డిజిటల్ ఇన్ ఫ్రా ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయి,  టెక్నాలజీ నాలెడ్జి డ్రివెన్ ఎకానమీ సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి.  దేశంలోనూ  ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అని అందరికీ పిలుపునిస్తున్నాను,  వచ్చే రెండు మూడేళ్లలో 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది.  అలాగే అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టంగానూ భారత్ ఎదుగుతుంది.  500  గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తాం.  ప్రతీ దేశంతోనూ భారత్ మైత్రినే కోరుకుంటుంది. అంతా కలిసి ఎదుగుదాం అనే భావన భారతదేశానిది   ఇతరులకు నష్టం కలిగించటం కాదు, ప్రయోజనం కల్పించటం ద్వారా అభివృద్ధి సాధించాలనేది భారత్ నినాదం  రాష్ట్ర గవర్నర్    అబ్దుల్ నజీర్  ప్రసంగం లో  సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొని ప్రసంగించిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ .  30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వరుసగా 8వ సారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది   దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైన ఈ సదస్సు ప్రపంచ వాణిజ్యాన్ని ప్రతిబింబిస్తోంది.  ప్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారు.  ఈ సదస్సు ద్వారా ప్రతీ ఆలోచనా, ప్రతీ పెట్టుబడి భవిష్యత్ తరాలకు సంపదగా మారాలని కోరుతున్నాను.భాగస్వామ్య సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు హాజరవ్వడం పట్ల చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామి సదస్సుకు మొత్తం 2500 మంది   పారిశ్రామక వేత్తలు హాజరైనట్లు పేర్కొన్నారు. పియోష్ గోయిల్ ఎంతో సృజనాత్మకంగా వ్యవహరిస్తూ డైనమిక్ లీడర్ గా మంచి పేరు సంపాదించారన్నారు. ఇండియాలోనే విశాఖపట్నం పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి నగరం అన్నారు. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రకృతి వనరులు కలిగిన రాష్ట్రంగా చెప్పుకొచ్చారు.  భారతదేశంలో సరి అయిన సమయంలో సరైన నాయకుడు అంటే మోడీ అని ప్రపంచ గుర్తించే స్థాయికి భారతదేశాన్ని మోడీ తీసుకెళ్లారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *