జాతీయ యూత్ పార్లమెంట్ నిర్వహిణ

Uncategorized
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 14   : ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇనిస్టిట్యూట్ ఫర్ డెమొక్రటిక్ ఎంగేజ్మెంట్ అండ్ ఎకౌంటబిలిటీ ఫౌండేషన్ (ఐడియా) ఆధ్వర్యంలో జాతీయ యూత్ పార్లమెంట్ నిర్వహించారు. ప్రారంభోత్సవ సభకు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ నరసింహారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిధులుగా దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి సూర్య ప్రకాష్ రావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.వీ.ఆర్.రాజు, విభాగాధిపతి ప్రొఫెసర్ పేటేటి ప్రేమానందం పాల్గుని జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్బంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ. నరసింహారావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు వలన యువత రాజకీయాల్లో పాల్గొని దేశానికి మంచి సేవ చేసే అవకాశాలు లభిస్తాయని , ఆనాడు దేశ నాయకులు విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారని ,ఇప్పటి నాయకులలో అటువంటి విజ్ఞత కొరవడిందని పేర్కొన్నారు. లా యూనివర్సిటీ వి సి ప్రొఫెసర్ డి.సూర్య ప్రకాషరావు మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమని , ఎన్ని ఉపద్రవాలు, అవంతరాలు వచ్చినా సజీవంగా పార్లమెంటు కొనసాగుతున్నదన్నారు. దానికి కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని తెలియజేశారు. పొలిటికల్ సైన్స్ విభాగం హెడ్ ఆచార్య పేటేటి ప్రేమానందం మాట్లాడుతూ పార్లమెంటరీ విలువలను, ఆనాడు నాయకుల త్యాగాలను వివరించారు. ఈ యంగ్ పార్లమెంట్ కార్యక్రమంలో స్పీకర్ గా పూజిత రెడ్డి, డిప్యూటీ స్పీకర్ గా అన్నెపు ఆదిత్య సాయి, పీ.ఎం.గా ఏనుగు ముఖేష్ సాయి, , కె.లావణ్య, నీలపు లలిత, మోదుగుల దివ్య జ్యోతి, రాయపూడి తెజశ్రీ, జి.హర్షవర్థన్, ఎన్.వికాస్ రెడ్డి, తదితరులు ప్రసంగిచ్చారు.
మహిళలు పట్ల పెరుగుతున్న హింస,పర్యావరణం ,సైబర్ క్రైమ్స్,ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్,నిరుద్యోగ భృతి వంటి అంశాలు పై విద్యార్థులు మాట్లాడారు. ముగింపు సమావేశంలో రెక్టర్ ప్రొఫెసర్ పులిపాటి కింగ్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ నరసింహారావు, ప్రొఫెసర్ పేటేటి ప్రేమానందం లు స్టూడెంట్స్ కి పలు సూచనలు ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో డా.కె.సత్యనారాయణ, డా.హరీష్, డా.రత్న రాజు, డా.పివీ రామ్. డా.దంతేశ్వర్రావు, డా.రంగనాథ్ రాయ్, డా.ప్రియాంక, స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *