సీఐఐ సదస్సుకు సర్వం సిద్ధం …. పెట్టుబడులే ఆకర్షణగా విశాఖ ముస్తాబు

ఆంధ్రప్రదేశ్‌

 Visakhapatnam:  సీఐఐ సదస్సుకు సర్వం సిద్ధం   పెట్టుబడులే ఆకర్షణగా విశాఖ ముస్తాబు * పెట్టుబడులే ఆకర్షణగా కోట్ల వ్యయంతో అభివృధ్ధి పనులు  పరిశ్రమలు రాక – యువతకు భవిత   విశాఖపట్నంలో 14,15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు నిర్వహణ వలన రాష్ట్రంలో బారిగా పెట్టుబడులు రానున్నాయని. గత నెల రోజులుగా విశాఖపట్నం జిల్లా యంత్రాంగం అహర్నిశలు శ్రమించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. నగరం నుండి భీమునిపట్నం వరకు ఉన్న సముద్ర తీరం రంగులమైం చేశారు. జీవీఎంసీ జోన్-2 ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లును ఊపిరాడకుండా చేసి మరి పనులు పూర్తి చేయించారు. నగరంలో యే ప్రధాన రహదారిలో ప్రవేశించినా నూతన రోడ్లను తలపిస్తున్నాయి. వివిధ దేశాల నుండి విచ్చేయుచున్న ప్రతి నిధులను ఆకర్షించడానికి ఆహ్లాదం కలిగించడానికి పర్యాటక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ప్రముఖులు రాకతో నగరంలో నెల్కొంది. పోలీస్ యంత్రాంగం కూడా యెక్కడ యెటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *