Flashmailnewsmedia
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 14 : బాలల దినోత్సవ సందర్భంగా నగరంలోని వేపగుంట వద్దగల గ్రేషియస్ జస్ట్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ అనాధ పాఠశాలల బాలలకు గీతం దంత కళాశాల ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం దంత సంరక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహరపు అలవాట్లు, దంతాల ప్రాధాన్యతపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దంత వైధ్యులు సమక్షంలో బాలల దినోత్సవ వేడుకలలను జరిపి పండ్లు, కేక్‌లను పంచారు. ఈ సందర్భంగా దంతవైద్యులు బాలలకు నోటి ఆరోగ్యం ప్రాధాన్యతను, ఆహరం తీసుకున్న అనంతరం తీసుకో వలసిన జాగ్రత్తలను వివిధ ఛార్టులు, వీడియో చిత్రాలు ద్వారా వివరించారు. ఈ సందర్భంగా దంత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి.నరసింహరావు మాట్లాడుతూ నగరంలోని పాఠశాలలో ఏడాది పొడవునా ‘‘శిశు గీతం’’ పేరిట ప్రత్యేక దంత వైద్యశిభిరాలను నిర్వహిస్తూ వస్తున్నామని, బాలల దినోత్సవం రోజున అనాధ బాలలకు గీతం దంతకళాశాలకు ఆహ్వనించి వారి సమక్షంలో దంత సంరక్షణ, బాలల దినోత్సవం జరపడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో చిన్నపిల్లల దంత వైద్య విభాగం (పెడోడాంటిక్స్) అధిపతి డాక్టర్ సి.శ్రీనివాస కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ పి.జయలక్ష్మి, డాక్టర్ బి.నళిని, డాక్టర్ పి.కోమలి, డాక్టర్ సి.హెచ్.పద్మజ, డాక్టర్ బి.శాంతి తదితరులుతో పాటు పి.జి వైద్య విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలలకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు.