గూగుల్, సీఐఐ సమ్మిట్ ఆహ్వాన సైకత శిల్పాన్ని సందర్శించిన భీమిలి ఎమ్మెల్యే గంటా. చంద్రబాబు, లోకేష్ బ్రాండ్ ఇమేజ్ తో విశాఖలో పెట్టుబడుల వెల్లువ.

General
గూగుల్, సీఐఐ సమ్మిట్ ఆహ్వాన సైకత శిల్పాన్ని సందర్శించిన భీమిలి ఎమ్మెల్యే గంటా.

Visakhapatnam, November 13  : మేజర్ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని  భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సీఐఐ సమ్మిట్  గూగుల్ డేటా సెంటర్ లను స్వాగతిస్తూ రుషికొండ బీచ్ లో తయారు చేసిన సైకత శిల్పాన్ని గురువారం సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అంతర్జాతీయ సంస్థలు రూ. లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం శుభసూచకమని పేర్కొన్నారు. సీఐఐ సమ్మిట్ లో రూ. 10 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరగనున్నాయని.. అనేక మంది పెట్టుబడిదారులు తమ ఒప్పంద ప్రతిపాదనలకు సమ్మిట్ లో చోటు కల్పించాలని ఇప్పటికీ కోరుతున్నారని వెల్లడించారు. విశాఖకు వచ్చే పరిశ్రమల్లో అత్యధిక శాతం భీమిలి నియోజకవర్గంలోనే ఏర్పాటు కావడం పట్ల స్థానిక ఎమ్మెల్యేగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతిష్టాకరమైన గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడాన్ని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఉద్దేశించిన సీఐఐ సమ్మిట్ విశాఖలో జరగడాన్ని ఆహ్వానిస్తూ.. ఆకాన్సెప్ట్ తో బీచ్ లో సైకత శిల్పాన్ని తయారీ చేసిన శిల్పి అప్పలనరసింహాన్ని గంటా అభినందించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకర్ల సందీప్, ఏపీటీడీసీ ఆర్డీ కల్యాణి, జిల్లా టూరిజం అధికారి మాధవి, కార్పొరేటర్ లొడగల అప్పారావు,  పిల్లా వెంకట్రావు, నాగోతి సత్యనారాయణ  చిన్ని కుమారి లక్ష్మీ, మొల్లి లక్ష్మణరావు, పిల్లా వెంకట్రావు, నాగోతి సత్యనారాయణ, కె.అచ్యుతరావు,శాఖారి శ్రీనివాస్, దొరబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *