ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగ విశ్రాంత ప్రొఫెసర్ వెలమల సిమ్మన్నకు ఈ సంవత్సరం లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం, జనవరి 18న విశాఖలో పురస్కారాల ప్రదానం

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 24 : ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగ విశ్రాంత ప్రొఫెసర్ వెలమల సిమ్మన్నకు ఈ సంవత్సరం లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ప్రకటించారు. దేశ విదేశాల్లోని నలుగురు ప్రముఖులకు జీవన సాఫల్య పురస్కారాలు కూడా ప్రకటించారు. లోక్నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు, పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఏ యూ హిందీ విభాగం సెమినార్ హాల్లో సోమవారం తన జన్మదినం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు అందించారు. 25 ఏళ్లుగా లోక్ నాయక్ ఫౌండేషన్ సంస్థ ఆంధ్రా జ్ఞానపీఠ్ పేరొందిన ఈ అవార్డు అందిస్తోందని, సాహిత్య పురస్కారంతోపాటు రెండు లక్షలు, జీవనసాఫల్య పురస్కార గ్రహీతలకు లక్ష రూపాయలు చొప్పున ఏటా ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. ప్రఖ్యాత కేన్సర్ చికిత్సా నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డలాస్లో గాంధీజీ అతి పెద్ద విగ్రహం ప్రతిష్టించి సామాజిక
ఆరన్ ఉదయ్ అరటి డా. తోటకూర ప్రసాద్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ తోటకూర ప్రసాద్, డెట్రాయిట్ కు చెందిన వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, సెంట్రల్ లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటిలకు జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. జనవరి 18న దసపల్లాలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, ప్రముఖ నటుడు రచయిత తనికళ్ల భరణి, మాజీమంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుల చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *