యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో ఏయూ ఎంఓయూ..ఏయూ విద్యార్థులకు లేటరల్ ఎంట్రీలో యూ.డబ్ల్యు.ఏ లో ప్రవేశానికి అవకాశం..సంయుక్తంగా కలసి పనిచేసే అంశాలపై ఆసక్తి వ్యక్తీకరణ

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 12 : నివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా (యూ.డబ్ల్యు.ఏ)తో ఆంధ్రవిశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏయూ రిజిస్ట్రాన్ ఆచార్య కె. రాంబాబు, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా వైస్ చాన్సలర్ ఆమిత్ చెక్మలు సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా- ఏయూ కెరియర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ను ఆయన ప్రారంభించారు. గతంలో ఏయూలో యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా (యూ.డబ్ల్యు.ఏ) చేసుకున్న ఎంఓయూను కార్యరూపంలో చూపడంతో పాటు మరిన్ని రంగాలలో కలసి పనిచేసే విధంగా నూతన ఎంఓయూ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ నూతన ఒప్పందం ఒక నిర్మాణాత్మక విద్యా మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏయూలో రెండు సంవత్సరాలు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బిటెక్) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్) పూర్తి చేసిన అర్హతగల విద్యార్థులు వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో (యూ.డబ్ల్యు.ఏ) బ్యాచిలర్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ (ఆనర్స్) యొక్క మూడవ సంవత్సరానికి నేరుగా లాటరల్ ఎంట్రీలో ప్రవేశం కల్పిస్తుంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో 2 సంవత్సరాల విద్యను పూర్తిచేసిన అనంతరం గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. ఈ ఒప్పందంరెండు విశ్వవిద్యాలయాలు మరియు భారతదేశం-ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. కార్యక్రమంలో భాగంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ బహుమతులు సాధించిన ఆచార్యులు, శాస్త్రవేత్తలను ఏయూకు ఆహ్వానిస్తామన్నారు. గ్రామీణ యువతను చైతన్యం చేస్తూ ఉన్నత విద్య దిశగా నడిపించే కార్యక్రమాలను నిర్వహిస్తున్న విధానం వివరించారు. డేటా సైన్స్ రంగంలో కలసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. రెండు సంస్థలకు పరస్పరం ఆసక్తి కలిగిన రంగాలలో కలసి పనిచేస్తామన్నారు. ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్సేంజ్, కెపాసిటీ బిల్డింగ్, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్థాపన తదితర అంశాలపై కలసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తంచేశారు. గతంలో చేసుకున్న ఎంఓయూను పూర్తిస్థాయిలో కార్యరూపంలో చూపుతామన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా వైస్ చాన్సలర్ ఆచార్య అమిత్ చక్మ మాట్లాడుతూ భారత్లో తమ వర్సిటీకి చెందిన రెండు శాఖలను ముంబాయి, చెన్నయిలో ప్రారంభిస్తున్నా మన్నారు. వీటిని నాణ్యత, ప్రతిభ ఆధారంగా నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్- వెస్ట్రన్ ఆస్ట్రేలియాల మధ్య మంచి బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఏయూలో పెద్దసంఖ్యలో ఉన్న విదేశీ విద్యార్థులు తనకు అమితమైన సంతోషాన్ని అందించారన్నారు. ఇది ఏయూకు ఉన్న బలమైన సంపదగా చెప్పవచ్చునన్నారు. సంయుక్తంగా ఏయూతో కోర్సులను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అదే విధంగా ఏయూ ఆచార్యులను సైతం తాము స్వాగతిస్తామని, తమ విశ్వవిద్యాలయం విద్యార్థులను సైతం ఇండియాకు పంపుతామన్నారు. ఏయూతో తాము మరింత బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తామన్నారు. ఏయూ వీసీని తమ విశ్వవిద్యాలయాన్ని సందర్శించాలని ఆహ్వా నించామని, దానికి సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, సిపిడిఈ డీన్ ఆచార్య వజీర్ మహ్మద్, అవుట్రేచ్ డీన్ ఆచార్య డి. లలిత భాస్కరి, యూ.డబ్ల్యు. ఏ ప్రో వైస్చాన్సలర్ (గ్లోబల్ ఎంగేజ్ మెంట్) జెన్నిఫర్ హోవెల్, నషీద్ చౌదురి, ఏయూ కళాశాలల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *