గీతంలో డెమ్‌కాన్‌`25 సదస్సు ముగింపు, ముఖ్య అతిధిగా విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎమ్.శ్రీభరత్

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 6 : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని జిమ్‌సర్‌ ఆసుపత్రి వేధికగా జరుగుతున్న డెమ్‌కాన్‌2025 జాతీయ సదస్సు శనివారం ముగిసింది. డిమెన్షియా నివారణ, చికిత్స మరియు అవగాహన కోసం పనిచేస్తున్న జాతీయ స్థాయి స్వఛ్చంద సంస్థ డిమెన్సియా ఇండియా అలయన్స్‌ మరియు గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి(జిమ్‌సర్‌) ఆసుపత్రి, స్నేహ సంధ్య ఏజ్‌ కేర్‌ ఫౌండేషన్‌, నిమ్‌ హేన్సుసెంటర్‌ ఫర్‌ బ్రెయిన్‌ రీసెర్చ్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌, ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎమ్.శ్రీభరత్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో డిమెన్షియా పట్ల అవగాహనతో పాటు బాధితలకు చికిత్స అందించే విస్తృత యంత్రాంగం అవసరమన్నారు. గీతం ఆసుపత్రిని డిమెన్సియా ఫ్రెండ్లీ ఆసుపత్రిగా తీర్చి దిద్దుతామన్నారు. కార్యక్రమంలోడిఐఎ ఎగ్సిక్యూటివ్ డైరక్టర్ రమణి సుందరం, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.రాజు తదితరులు పాల్గొన్నారు. డెమ్‌కాన్‌`2025 జాతీయ సమావేశాలకు దేశం లోని వైద్యులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు, విద్యార్ధులు, ఆసుపత్రులు, వృద్దాశ్రమాలు, సంరక్షకులు మరియు వృద్దుల సంరక్షణ సంస్థలతో సహ దాదాపు 800 మంది ప్రతినిధులు హజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *