ఈస్ట్ కోస్ట్ రైల్వే లో మహిళలకు డివిజనల్ రైల్వే హాస్పిటల్ క్యాన్సర్ స్క్రీనింగ్,హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్

రైల్వే

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 9 : ఈస్ట్ కోస్ట్ రైల్వే డి. ఆర్ .ఏం . లలిత్ బోహ్రా మాట్లాడుతూ వాల్టేర్ డివిజన్ మెడికల్ డిపార్ట్‌మెంట్ లో మంగళవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఈస్ట్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంస్థ వాల్టేర్ డివిజన్ సభ్యులు వారి భార్యల కోసం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడింది. ఈ అవగాహన కార్యక్రమం క్యాన్సర్, న్యూరోలాజికల్, కార్డియోలాజికల్ ఎండోక్రైన్ ఆరోగ్య సమస్యలను పరిష్కరించింది. దీనిని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా ఈస్ట్ కోస్ట్ విమెన్ సొసైటీ అధ్యక్షురాలు జ్యోత్స్నా బోహ్రా ప్రారంభించారు. మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి శరత్ బాబు మార్గదర్శకత్వంలో రైల్వే డాక్టర్ల బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎ డి ఆర్ ఏం ఆపరేషన్స్ కె రామ రావు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. క్లిటికల్ హెల్త్ ఇష్యూల గురించి సభ్యులకు అవగాహన కల్పించడం మరియు నాణ్యమైన వైద్య సలహా చికిత్సా ఎంపికలకు కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. మహిళా పాల్గొనేవారి మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఎక్సిక్యూటివ్ ఆరోగ్య తనిఖీ కూడా నిర్వహించబడింది, .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *