

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 6 : 72 వ పురుషుల, 11వ మహిళల ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు రైల్వే స్టేడియం లో ముగిసాయి. ఈ కార్యక్రమానికి జి ఏం పరమేశ్వర్ ఫంక్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతీయ రైల్వేల అంతటా అసాధారణమైన అథ్లెటిక్ ప్రతిభను ప్రదర్శించారని, వివిధ రైల్వే జోన్‌ల నుండి 17 జట్లకు ప్రాతినిధ్యం వహించిన 180 మంది వెయిట్ లిఫ్టర్లు 16 పురుషులు, మహిళల విభాగాల జట్టు లను అభినందించారు. ఈ ఛాంపియన్‌షిప్ క్రీడా స్ఫూర్తిని పెంపొందించింది ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహించిందన్నారు. జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో విజయవంతంగా నిర్వహించి, దానిని గొప్ప స్థాయికి తీసుకెళ్లినందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టెయిర్ అధికారులను ప్రశంసించారు. జనరల్ మేనేజర్ విజేతలు, రన్నరప్‌లు ప్రత్యేక అవార్డు గ్రహీతలకు ట్రోఫీలు మెమెంటోలను అందజేశారు. డి ఆర్ ఏం లలిత్ బోహ్రా ఈ కార్యక్రమానికి మరో అతిథిగా హాజరయ్యారు. వేడుకలో పాల్గొన్న ఎ డి ఆర్ ఏం కె. రామారావు, (ఆపరేషన్స్); ఎం. హరనాథ్, స్పోర్ట్స్ ఆఫీసర్ & సీనియర్ ట్రెజరర్ సీనియర్ జుసుఫ్ కబీర్ అన్సారీ, ఇతర అధికారులు వున్నారు. వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనకారులు: ఉత్తమ లిఫ్టర్ ఉమెన్ – కోమల్ కోహార్ – నార్త్ సెంట్రల్ రైల్వే ఉత్తమ లిఫ్టర్ పురుషులు- టి మాధవన్- ఉత్తర రైల్వే., టీమ్ ఛాంపియన్స్- మహిళలు- విజేతలు- 184 పాయింట్లతో సెంట్రల్ రైల్వే, మహిళలు- రన్నర్లు- 174 పాంట్లతో నార్త్ ఈస్టర్న్ రైల్వే . పురుషులు-విజేతలు- దక్షిణ రైల్వే- 190 పాయింట్లతో పురుషులు-రన్నర్లు- ఉత్తర రైల్వే- 188 పాయింట్లతో నిలిచారని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె పవన్ కుమార్ తెలిపారు.


