క్రీడల్లో రాణించిన క్రీడాకారులు మంచి భవిష్యత్ వ్యాయామ విద్యా విబాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి

క్రీడలు

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 6 : క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఏయూ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ స్ హెడ్ ఆచార్య ఎ. పల్లవి అన్నారు. శనివారం ఎ యూ జిమ్మాజియంలో ఏయూ టేబుల్ టెన్నిస్ జట్టు ఇంటర్ యూనివర్శిటికి ఎంపికయిన క్రీడాకారిణిలను ఆచార్య ఎ.పల్లవి అభినందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సౌత్ ఇండియా యూనివర్శిటి మహిళల టేబుల్ టెన్నిస్ పోటీలు గీతం డీమ్డ్ యూనివర్శిటిలో ఈనెల 8 నుంచి 11 వరకు జరగనున్నాయని. ఈపోటీలకు ఏయూ టేబుల్ టెన్నిస్ మహిళా జట్టు పాల్గొని ఆడనున్నట్లు తెలిపారు.వి.గుణ సంయుక్త, పి భవిత గాయత్రి డిగ్రీ, పీజీ కాలేజ్ బుషికొండ, ఎం. దీప్తి డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల, ఎస్ ఐశ్వర్య. వి.ఉమామాధురి జీవిపి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ క్రీడాకారులు ఎంపికయ్యారన్నారు. జట్టు మేనేజర్ గా గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మంగళ గౌరి ఉంటారని, ఏయూ ఫ్యాకల్టీ ఉదయ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *