జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (జీఐఎస్) డే 2025

Uncategorized

Visakha education, November 20 : భూభౌతిక శాస్త్ర విభాగం (జియోఫిజిక్స్ విభాగం), ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమాటిక్స్ (ISG) -విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జిగోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (జీఐఎస్) డే 2025 ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS) డైరెక్టర్ డా. ఆర్. పి. సింగ్ “డిజిటల్ ప్రపంచంలో రిమోట్ సెన్సింగ్ మరియు జిఐఎస్ పాత్ర: పరిణామం, ప్రస్తుత స్థితి, మరియు భవిష్యత్తు సామర్థ్యాలు” (Role of Remote Sensing and GIS in the Digital World: Evolution, Current Status, and Future Potentials) అంశంపై ఆన్లైన్లో అతిథి ఉపన్యాసం ఇచ్చారు. పర్యావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక, వాతావరణ అధ్యయనాలు మరియు డిజిటల్ గవర్నెన్స్ లో భౌగోళిక సాంకేతికతలు (Geospatial Technologies) పోషిస్తున్న పరివర్తనాత్మక పాత్రను డా. సింగ్ వివరించారు. భూ పరిశీలన (Earth observation), బిగ్ డేటా అనలిటిక్స్, మరియు ఏఐ (Al)-ఆధారిత జియోస్పేషియల్ ఇంటిలిజెన్స్ లో (Geospatial Intelligence) జరుగుతున్న వేగవంతమైన పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమానికి ఏ యూ కాలేజీ అఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం వి ఆర్ రాజు, ఐఎస్ – విశాఖపట్నం చాప్టర్ చైర్మన్ ప్రొఫెసర్ కె. నాగేశ్వర రావు, ఐఎస్ -విశాఖపట్నం చాప్టర్ సెక్రటరీ వజీర్ మహమ్మద్, భూభౌతిక శాస్త్ర విభాగం అధిపతి, కార్యక్రమ కన్వీనర్ డా. బి. ఆనంద గజపతి రాజు హాజరయ్యారు. యువ నిపుణులలో భౌగోళిక ລ້ລ້ລ້ (Geospatial Awareness) ప్రముఖులు అభినందించారు. భూభౌతిక శాస్త్రం, భూగర్భ శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, వాతావరణ శాస్త్రం- సముద్ర శాస్త్రం, ఇంజనీరింగ్, మరియు సివిల్ ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *