విశాఖ మహిళకు ‘సేఫెస్ట్ సిటీ,మహిళా పోలీసులతో కలిసి హోంమంత్రి ర్యాలీ , రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రి వంగలపూడి అనిత

ఆంధ్రప్రదేశ్‌

విశాఖపట్నం, డిసెంబర్ 4 : మహిళా భద్రతే ప్రభుత్వ ప్రదమ ప్రాధాన్యమని, విశాఖ ‘సేఫెస్ట్ సిటీ’గా నిలవడం నిజంగా గర్వకారణమని, రాష్ట్ర ప్రగతికి టిడిపి ఒక్కటే కొలమానం కాదని, రాష్ట్రంలో మహిళలు ఎంత భద్రంగా ఉన్నారు. వారిపై క్రైమ్ రేట్ ఎంత తగ్గింది అనేదే నిజమైన ప్రగతికి అసలు కొలమానమని రాష్ట్ర హోమ్ విపత్తు నిర్వహణ శాఖా మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్ని, నగర పోలీసు ఉన్నతాధికారులు, మహిళా కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులతో కలిసి గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏ.యూ. కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హెూమ్ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. హోం మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి మహిళల రక్షణే మా ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అందమైన విశాఖపట్నం పర్యాటకంగా, పారిశ్రామికంగా, ఐ టీ అభివృద్ధి చెందుతోందన్నారు. ఇటువంటి వేగంగా పెరుగుతున్న నగరానికి “నారీ రిపోర్ట్” విశాఖపట్నం లో భారతదేశంలో మహిళలకు అ త్యంత సురక్షిత నగరంగా ప్రకటించడం మనందరికీ, ముఖ్యంగా పోలీస్ శాఖకు ఒక పెద్ద గౌరవమని అన్నారు. ఈ విషయాన్ని పెట్టుబడిదారుల సమ్మిట్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగిందన్నారు. విశాఖ పోలీసులు కమిట్మెంట్, డిసిప్లిన్, మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారని, దీనికి నిదర్శనమే శక్తి టీమ్స్, శక్తి యాప్ వనితీరని, మహిళలు ఎప్పుడు ఆపదలో ఉన్నా శక్తి యాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తే, అర్బన్ ఏరియాలో 15 నిమిషాల్లో, రూరల్ ఏరియాలో 10 నిమిషాల్లో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని రక్షిస్తున్నారని చెప్పారు. ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక యువతిని శక్తి టీమ్ కాపాడి కౌన్సిలింగ్ ఇవ్వడం పల్ల, ఆ అమ్మాయి ఈరోజు డిఎస్సీ ఉద్యోగం సాధించి తన కుటుంబానికి అండగా నిలబడిందని తెలిపారు. ఇది పోలీస్ వ్యవస్థ ఎంత సున్నితంగా, ఎంత బాధ్యతగా పనిచేస్తుందో చూపించే ఉదాహరణగా చెప్పారు. నేరస్థుల్లో భయం కలిగేలాగా పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు. గత మూడు నెలల్లోనే అనేక కేసుల్లో నిందితులకు 25 ఏళ్ల వరకు శిక్షలు పడేలా చేశామని, తప్పు చేస్తే వెంటనే జైలుకెళ్లారనే భయం సిస్టమ్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇది మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యల ఫలితమని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కఠినంగా వ్యవహరిస్తోందని, కానీ పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉందన్నారు.. “అమ్మకు చెప్పలేని పని ఏదో చేయకూడదు” అనే విషయాన్ని పిల్లలకు చిన్న వయసులోనే నేర్పించాలన్నారు.. మన పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే, ఒక మంచి సమాజాన్ని ఇవ్వడం మన పెద్దల లక్ష్యం కావాలన్నారు. అది మన అందరి బాధ్యత. విశాఖ వైద్ను జాతీయ స్థాయిలో నిలబెట్టిన పోలీస్ సిబ్బందికి, వారితో కలిసి పనిచేస్తున్న లాయర్లకు, సహకరిస్తున్న ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. సీపీ మాట్లాడుతూ “సిటీ -ఆఫ్ డెస్టినీ” మన విశాఖపట్నం గత ఏడాదిన్నర కాలంగా అభివృద్ధి దిశగా చాలా వేగంగా ముందుకు వెళ్తందన్నారు. పారిశ్రామికవేత్తలు మన నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారన్నారు. పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఒక నగర అభివృద్ధికి ఎంత అవసరం పెట్టుబడులు, టూరిజం అయితే, అదే స్థాయిలో శాంతిభద్రతలు కూడా అవసరమని చెప్పారు. అందులో ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత కీలకమని, ఎందుకంటే మహిళలు క్షేమంగా ఉంటేనే మనందరం క్షేమంగా ఉంటామన్నారు. హెూం మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, డిజిపి ఆదేశాల మేరకు వైజాగ్ సిటీ పోలీసులు 24/7 పనిచేసిన కృషి ఫలితంగా “నారి రిపోర్ట్ 2025 లో విశాఖపట్నం దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ అధికారికంగా ప్రకటించారని వెల్లడించారు. ఈ గుర్తింపు మన నగర పోలీసుల కృషికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతకు ప్రతిఫలం అన్నారు. ప్రస్తుతం నగరంలో మహిళల భద్రత కోసం శక్తి టీమ్స్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయన్నారు. శక్తి యాన్ ద్వారా పోలీసులు వెంటనే స్పందించే వ్యవస్థ అందుబాటులో ఉందని, ముఖ్యంగా ద్రోక్ష వినియోగం క్రైమ్ జోన్ ఏరియాలు, మారుమూల ప్రాంతాల్లో మహిళలకు భద్రతను బలోపేతం. చేస్తుందని. నేటి పరిస్థితుల్లో ఆన్లైన్ నేరాలు పెద్ద సమస్యగా మారాయని, భౌతిక దాడులు కనిపిస్తాయని, కానీ ఆన్లైన్ వేధింపులు కనిపించవని చెప్పారు.. అనేక యువతులు ఆన్లైన్ క్లాసులు లేదా సోషల్ మీడియా ద్వారా బ్లాక్ మెయిలింగ్. నేధింపులకు గురవుతున్నారని తెలిపారు. కొందరు. తీవ్ర ఆందోళనతో ఆత్మహత్యలను కూడా ఆలోచించే స్థితికి వెళ్తున్నారని చెప్పారు. దీనిపై అవగాహన కల్పించడానికి మేము పాఠశాలలు, కళాశాలలు. కార్పొరేట్ ఆఫీసుల్లో “నవసమాజ నిర్మాణం” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు వెంటనే దగ్గర్లోని ఏ పోలీస్ స్టేషన్ కైనా రావచ్చు లేదా నేరుగా నా మొబైట్ నంబర్ 7995096799 కు కాల్ చేయవచ్చని, మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉందబడతాయన్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తామన్నారు. జానీ ముఖ్యంగా, మీరు ధైర్యంగా ముందుకు మాట్లాడుతూ విమెన్ సేఫ్టీ సెక్యూరిటీ విమెన్ వెల్ఫేర్ కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో మూడు కాలేజీ ప్రిన్సిపల్స్ గా విమెన్ ఉండడం జరిగిందన్నారు. కాంపెన్సేటర్ అపాయింట్మెంట్స్ లో ఒక విమెన్ సెక్యూరిటీ గార్ట్ ని ప్రప్రథమంగా అపాయింట్ చేయడం జరిగిందని, గ్రీవెన్స్ సెల్, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయన్నారు. నగర పోలీస్ శాఖ విశాఖపట్నంలో ఎంత కృషి చేస్తున్నారు అన్నది నేను స్వయంగా చూశానని, సొసైటీని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి-1 ఎల్ అండ్ ఓ వి.ఎన్. మణికంఠ చందోలు, డి.సి.పి-రావాలి అని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ వి.సి ప్రొఫసర్ జి.వి రాజశేఖర్,ఎల్అ అండ్ ఓ డి. మేరీ ప్రశాంతి, డి.సి.పి జైమ్స్ లతా మాధురి, నగర ఏ.డి.సి.వి లు, ఏ.సి.పి లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *