విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 17 : ఫోర్ట్
స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా SAI అకాడమీ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో సాయి విద్యార్థులకు వార్షిక స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ సోమవారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు వారితో పాటు SAI చీఫ్ కోచ్ సత్యనారాయణ , జి సూరిబాబు అధ్యక్షులు, వాలీబాల్ అసోసియేషన్ విజయనగరం, కె.ఆర్. ఏ కుమార్ సెక్రెటరీ వాలీబాల్ అసోసియేషన్ విశాఖపట్నం, మోహన్ బాబు, వాలీబాల్ కోచ్
క్రీడాకారులు, కోచులు పాల్గొన్నారు.
