Flashmailnewsmedia
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 14 : ఆంధ్రవిశ్వవిద్యాలయంతో సైయంట్ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, సైయంట్ సంస్థ ప్రెసిడెంట్- హెడ్, కార్పొరేట్ పంక్సన్స్ డాక్టర్ పి.ఎన్.ఎస్.వి నరసింహం సంతకాలు చేశారు. అనంతరం ఒప్పంద పత్రాలను పరస్సపరం మార్చుకున్నారు. అవగాహన ఒప్పందంలో భాగంగా తమ విశాఖపట్నం కేంద్రంలో సైయంట్ సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ (సీఒఈ), ఇన్నోవేషన్ లాట్ని ఏర్పాటు చేయనుంది. దీనిలో భాగంగా ఏయూతో సైయంట్ కలసి పనిచేయాలని నిర్ణయించింది. ఏయూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియో ఇంజనీరింగ్ విభాగాలతో వివిద అంశాలలో కలసి పనిచేయనుంది. ఏయూలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్ షిప్లను సైయంట్ సంస్థ తమ ఇన్నోవేషన్ లాబ్లలో అందిస్తుంది. సైయంట్ సంస్థ ప్రత్యేక నిపుణుల ప్రసంగాలను ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతికతలపై అవగాహన కల్పిస్తుంది. అవసరమైన అంశాలలో ఏయూ పరిశోదకులు, ఆచార్యుల సహకారాన్ని స్వీకరిస్తారు. సైయంట్ సంస్థ నిర్వహించే హ్యాకథాన్లలో ఏయూ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో సైయంట్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నా