Visakhapatnam: విశాఖ జిల్లాలో సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ 2025 కార్యక్రమాల సమీక్షల కోసం బుదవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వాయుమార్గంలో బుధవారం సాయంత్రం నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి స్థానిక నేతలు, అధికారులు నుంచి విశాఖ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. సిఎం కు స్వాగతం పలికిన వారిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, హోం శాఖామంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు ఎమ్. శ్రీ భరత్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు , ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు, గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ గోపాల్ ఇతర అధికారులు. పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
