Visakhapatnam, November 7 Flash Mail News : వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రవిశ్వవిద్యాలయం క్రీడా మైదానం వద్ద దేశభక్తిని తెలియజేస్తూ వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఏయూ క్యాంపస్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని వందేమాతర గీతాన్ని గానం చేశారు. ఏయూ సంగీత విభాగం విద్యార్థులు శ్రావ్యమైన గానానికి వందలాది మంది యువత గళం తోడయ్యింది. దేశభక్తిని యువతలో నింపుతూ, జాతీయ భావాన్ని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఏ.నరసింహా రావు, కె.సీతామాణిక్యం, ఆర్. పద్మశ్రీ, ఎం.వి.ఆర్. రాజు,నగ రాజ కుమార్, జి. గిరిజా శంకర్, జి. శశిభూషణ రావు, క్రీడా విభాగం సందాలకులు ఆచార్య ఎన్ విజయ మోహన్, డీన్లు ఆచార్య ఎన్. ఎం యుగంధర్, ఆచార్య సి. హెచ్ ఆశా ఇమ్మానియల్ రాజు, ఆచార్య టి. షారోన్ రాజు, ఆచార్య ఏ.పల్లవి, ఆచార్య ఎస్. హరనాథ్, కె శ్రీనివాస రావు త దితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వందేమాతరం గీతం స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అందరిలోను భావోద్వేగాన్ని పెంపొందించిందన్నారు.
