ఘ‌నంగా ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం పూర్వ‌విద్యార్థుల స‌మ్మేళనం…-ముఖ్య అతిధిగా హాజ‌రైన రాజ్య‌స‌భ స‌భ్యురాలు సుధామూర్తి

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 13 :ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం పూర్వ‌విద్యార్థుల సంఘం వార్షిక స‌మ్మేళ‌నం వేవ్స్ 2025 ఘ‌నంగా ప్రారంభ‌మైంది. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్‌, మూర్తి ట్ర‌స్ట్ చైర్ ప‌ర్స‌న్‌, రాజ్య‌స‌భ స‌భ్యురాలు శ్రీ‌మ‌తి సుధామూర్తి హాజ‌ర‌య్యారు. ముందుగా ఆమె ఏయూ పూర్వ‌విద్యార్థుల సంఘం కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. సంఘం వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ జి.ఎం రావుతో క‌లిసి క‌మిటి స‌భ్యుల‌తో స‌మా వేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం అభివృద్ధికి పూర్వ‌విద్యార్థులు స‌హ‌కారం అందించాల్సిన విధానంపై ప‌లు విలువైన సూచ‌న‌లు చేశారు. ఏయూలో ఉన్న తాళ‌ప్ర‌తాల జ్ఞానాన్ని సంబంధిత నిపుణుల‌తో అధ్య‌య‌నం చేయించి, వినియోగంలోకి తీసుకురావాల‌న్నారు. బ‌ల‌మైప పూర్వ‌విద్యార్థుల బంధాన్ని ఏర్ప‌ర‌చ‌డం, బోధ‌న ప‌టిష్టం చేయ‌డం, ఉపాధి అవ‌కాశాలు మెరుగు ప‌ర‌చ‌డంలో ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. క‌ట్ట‌మంచికి పుష్పాంజ‌లి….. ముఖ్య అతిధి శ్రీ‌మ‌తి సుధామూర్తి ఏయూ ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ముఖ్య అతిధికి ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ పుష్ప‌గుచ్చం అంద‌జేసి ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఎన్‌.సి.సి విద్యార్థుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. విశ్వ‌విద్యాల‌యం వ్య‌వ‌స్థాప‌క ఉప‌కుల‌ప‌తి క‌ట్ట‌మంచి రామ‌లింగారెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి పుష్పాంజ‌లి ఘ‌టించారు. కార్య‌క్ర‌మంలో ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్‌, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, పూర్వ‌విద్యార్థుల సంఘం వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ జి.ఎం రావు, సంఘం చైర్మ‌న్ కె.వి.వి రావు, కార్య‌వ‌ర్గ స‌భ్యులు, ఏయూ ఆచార్యులు, ఉద్యోగులు త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం ఏయూ ప‌రిపాల‌నా భ‌వ‌నం నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ ర‌త‌న్ టాటా ఆవిష్క‌రించిన ఏయూ పూర్వ‌విద్యార్థుల సంఘం పైలాన్ సంద‌ర్శించారు. అనంత‌రం ప్ర‌ధాన వేదిక‌పై జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న‌తో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. వ్య‌వ‌స్థాప‌క ఉప‌కుల‌ప‌తి క‌ట్ట‌మంచి రామ‌లింగారెడ్డి చిత్ర‌ప‌టానికి పూల‌మాల అంజ‌లి ఘ‌టించారు. కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస రావు, ఏయూ పూర్వ‌విద్యార్థుల సంఘం ఉపాద్య‌క్షులు డాక్ట‌ర్ కుమార్ రాజ‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఆకుల చంద్ర‌శేఖ‌ర్‌, ఇ.సి స‌భ్యులు బి.వి.ఎన్ రావు, డాక్ట‌ర్ ఎస్‌.కె.ఇ అప్పారావు, ఆచార్య బి.మోహ‌న వెంక‌ట రావు, వై.వి అనూరాధ, ఏఏప పూర్వ చైర్మ‌న్‌, ఏయూ మాజీ వీసీ ఆచార్య బీల స‌త్య‌నారాయ‌ణ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆక‌ట్టుకున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు… కార్య‌క్ర‌మంలో భాగంగా ముందుగా వేదిక‌పై ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి. భార‌తీయ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను అద్దం ప‌డుతూ ప్ర‌ద‌ర్శించిన శాస్త్రీయ, జాన‌ప‌ద నృత్యాలు ఎంత‌గానో అల‌రించాయి. ఏయూకు ఉన్న బ‌ల‌మైన విదేశీ విద్యార్థులు సైతం త‌మ దేశ సంస్కృతిని ప్ర‌తిబింబిస్తూ నృత్యాల‌తో అల‌రించారు. కార్య‌క్ర‌మానికి ఆరంభం సూచ‌కంగా ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించిన అష్ట‌ల‌క్ష్మి నృత్య రూపకం మ‌హిళా శ‌క్తికి నిద‌ర్శ‌నంగా నిల‌చింది. భారీగా హాజ‌రైన పూర్వ‌విద్యార్థులు, ప్ర‌ముఖులు, ఏయూ విద్యార్థులతో కార్య‌క్ర‌మం ఉత్సాహంగా సాగింది. సాఘ‌ర ఘోష‌ను మించిపోయే విధంగా విద్యార్థుల స‌దండితో ప్రాంగ‌ణం శోభ‌లీనింది. విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ధి ఉత్స‌వాలు జ‌రుపుకుంటున్న సంద‌ర్భంలో భాగంగా జ‌రుగుతున్న పూర్వ‌విద్యార్థుల స‌మ్మేళ‌నానికి అపూర్వ స్పంద‌న ల‌భించింది. అశేష జ‌న వాహిని ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌మై ప్ర‌త్య‌క్షంగా, దృశ్య‌మాధ్య‌మంలో వీక్షించారు. ఏయూకు రూ 70 లక్షలు విరాళం అందించిన దేవ పురాణం పూర్వ విద్యార్థిని అభినందించిన వీసీ రాజశేఖర్ విశాఖ ఎడ్యుకేషన్ డిసెంబర్ 13మేజర్ న్యూస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థి డాక్టర్ దేవ పురాణం వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో భారీ విరాళం అందించారు. కొద్దిరోజుల క్రితం ప్రకటించినట్టుగానే రూ 70 లక్షలు విరాళాన్ని ఏయూ పూర్వవిద్యార్థుల సమావేశం జరుగుతున్న సదర్భంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ సమక్షంలో రిజిస్ట్రాన్ ఆచార్య కె. రాంబాబుకు కార్యాలయంలో అందజేశారు. విశ్వవిద్యాలయం మౌళిక వసతులు, సుందరీకరణకు, విద్యార్థులకు స్కాలర్షిప్లు రూపంలో ఈ నిధులను వినియోగించాలని ఈ సందర్భంగా దేవ పురాణం వర్సిటీ అధికారులను కోరారు. తన ఉన్నతికి కారణమై, తమ ప్రగతికి ప్రాథమిక పునాదులను నిర్మించిన ఆంధ్రవిశ్వవిద్యాలయం తనకు మాతృమూర్తితో సమానమని దేవ పురాణం అన్నారు. నిరంతరం తాను చదువుకున్న విశ్వవిద్యాలయానికి సేవ చేయడానికి, తనవంతు సహకారం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషిచేస్తున్న డాక్టర్ దేవ పురాణంను ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అభినందించారు. ఇది మరెందరికో స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. పూర్వవిద్యార్థులంతా తమ విభాగాలను, విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దడంలో భాగం కావాలని సూచించారు. పూర్వవిద్యార్థుల సహకారంలో శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. ఆలుమ్ని రిలేషన్స్ డీన్ ఆచార్య పి.శ్యామల మాట్లాడుతూ గతంలో దేవి పురాణం ఫార్మశీ కళాశాల హాస్టల్ నిర్మాణానికి, ఏయూ కెమిస్ట్రీ విభాగం ప్రయోగశాలలు, సెమినార్ హాల్ ఆధునీకరణ, ఫార్మశీ కళాశాల మౌళిక వసతుల కల్పను భారీ విరాళం, సహకారం అందించారన్నారు. నేడు మరొక పర్యాయం విశ్వవిద్యాలయంపై తనకున్న ప్రేమను చూపుతూ భారీ విరాళం అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. విభాగాలలో ఉత్సాహంగా పూర్వవిద్యార్థుల సమావేశాలు : శనివారం ఉదయం పూర్వవిద్యార్థుల సమావేశాలు ఉత్సాహంగా జరిగాయి. ఉదయం 10 నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు ప్రతీ విభాగంలో పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు జరిగాయి. -సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన పూర్వవిద్యార్థుల సమావేశంలో విభాగ పూర్వవిద్యార్థులు టీడీపీ రాష్ట్ర అద్యక్షులు, శాసన సభ్యులు పల్ల శ్రీనివాస రావు, బీజేపీ శాసన సభ్యులు పి. విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. విభాగ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా విభాగ మెదటి బ్యాచ్ విద్యార్థి బ్రాహ్మణయ్యను సత్కరించారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి, విభాగ ఆచార్యులు, విశ్రాంత ఆచార్యులు, పూర్వవిద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -కెమిస్ట్రీ విభాగంలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల సమావేశానికి అమెరికాలో స్థిరపడిని పూర్వవిద్యార్థి డాక్టర్ దేవ హెచ్ పురాణం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వినూత్నంగా ఆలోచించడం, మీ సామర్థ్యాలను తెలుసు కోవడం, మీ ప్రగతి బాటలను నిర్మించుకోవడం ఎంతో ప్రధానమని విద్యార్థులకు సూచించారు. ఏయూలో విద్యార్థి దశ నుంచి నేడు అమెరికాలో ఉన్నతంగా స్థిరపడటంతో తన కష్టాన్ని విద్యార్థులకు వివరించారు. ఉన్నత లక్ష్యా లను స్థిరపరచుకుని ముందుకు సాగాలన్నారు. జర్నలిజం విభాగంలో నిర్వహించిన సమావేశంలో విభాగం తొలి బ్యాచ్ విద్యార్థి డి. శేష పద్మ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విలువలను నిలుపుకుంటూ మీడియా రంగం లో కొనసాగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య సి.ఎం వినయ్ కుమార్, ఆచార్య చల్ల రామకృష్ణ, విజయలక్ష్మి, పరిశోధకులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగంలో ” కోలాహలంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.అర్థశాస్త్ర విభాగంలో జరుగుతున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆచార్యులు, పరిశోధకులు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, బోధనేతర సిబ్బందితో పాటు 1953-55 నుంచి 2023-25 బ్యాచ్ వరకు చదువుకున్న వందల మంది పూర్వ విద్యార్థులు పాల్గొని వారు చదువుకున్న రోజులలో విశ్వవిద్యాలయంలో తమకు ఉన్నటువంటి అనుభవాలను, అనుబంధాన్ని తమ తోటి విద్యార్థులతో పంచుకొని ఉత్సాహభరితంగా గడిపారు. జర్న లిజం విభాగంలో : నిర్వహించిన సమావేశంలో విభాగం తొలి బ్యాచ్ విద్యార్ధి డి. శేష పద్మ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విలువలను నిలుపుకుంటూ మీడియా రంగంలో కొనసాగాలని విద్యార్ధులకు సూచించారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య సి.ఎం వినయ్ కుమార్, ఆచార్య చల్ల రామకృష్ణ, విజయలక్ష్మి, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, భూగర్భ శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె. సత్యనారాయణ రెడ్డి, 13 వ తేదీన ఉదయం 10:00 గంటలకు భూగర్భ శాస్త్ర విభాగంలోని సెమినార్ హాల్‌లో పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన సమావేశానికి అధ్యక్షత వహించి, విభాగం యొక్క కార్యకలాపాలను వివరించారు. ఈ సందర్భంగా పి .జి. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫె ఇ.ఎన్. ధనమజయ రావు విభాగం కార్యకలాపాల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గనుల మరియు భూగర్భ శాస్త్ర సంచాలకులు శ్రీ డబ్ల్యూ. బాలచంద్ర శేఖర్ సభను ఉద్దేశించి ప్రసంగించి, ప్రస్తుత విద్యార్థులను ప్రోత్సహించి, విభాగంతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. ఓఎన్‌జిసి మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ పి.వి.ఎస్. ప్రసాద్, మాజీ ఎస్.పి. బి. ప్రసాద రావు మరియు రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి. శ్రీ రామచంద్ర మూర్తి తమ జీవిత ప్రయాణాల గురించి మాట్లాడి విద్యార్థులను ప్రేరేపించారు. జాతీయ ఖనిజ పురస్కార గ్రహీత డాక్టర్ పి.ఎస్.ఎన్. మూర్తి, ప్రొఫెసర్ సి. కాశీపతి (పదవీ విరమణ), ప్రొఫెసర్ కె. విశ్వనాథ్ (పదవీ విరమణ), ఓఎన్‌జిసి మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ పి.వి.ఎస్. ప్రసాద్, మాజీ ఎస్.పి. శ్రీ బి. ప్రసాద రావు మరియు రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి. శ్రీ రామచంద్ర మూర్తిలను విభాగం యొక్క విశిష్ట పూర్వ విద్యార్థులుగా సత్కరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పలువురు పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుబంధ ఆచార్యులు డాక్టర్ ఎ. యుగంధర రావు మరియు డాక్టర్ ఎ.వి.ఎస్.ఎస్. ఆనంద్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. సహాయ ఆచార్యులు డాక్టర్ కె. అర్జునుడు, డాక్టర్ జె.వి. రమణ, డాక్టర్ ఎం. శ్రీనివాస రావు, డాక్టర్ జి. రాజా రావు, డాక్టర్ టి. కరుణాకరుడు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు మరియు బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐఏఎస్ఇ బీఈడీ కళాశాలలో డిసెంబర్ 13న పూర్వవిద్యార్థుల కలయిక ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ఇ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నగరాజుకుమారి గారు మరియు ,ముఖ్య అతిధిగా ఐఏఎస్ఈ పూర్వ విద్యార్థి గ్రూప్ -వన్ అధికారి గా అమరావతి సెక్రటరియేట్ లో సేవలందిస్తున్న ఎమ్. పోలీనాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నతమైన స్థానం అధిరోహించాలంటే పేదరికం మరియు భాష అనేది అవరోధం కాదని విద్యార్థులకు ఎంతో ప్రోత్సహించి వారి జీవితాన్నే ఉదాహరణ గా చెప్పి విద్యార్థుల లో ప్రేరణ నింపడం జరిగింది. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు పూర్వ విద్యార్థులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా చురుకుగా పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *