కోటి సంతకాల సేకరణకు అనూహ్యస్పందన. దక్షిణంలో సేకరించిన 60వేల సంతకాల ప్రతులు.. నేడు ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరవేస్తాం.. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

రాజకీయాలు

Visakhapatnam, December 9 : వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూపొందించిన ఉద్య‌మాల‌కు ప్ర‌జ‌ల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోందని విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కోటి సంతకాల సేకరణ కార్య‌క్ర‌మం ఉత్సాహంగా కొన‌సాగుతుందని పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గం లోని 14 వార్డుల కార్పొరేటర్లు అలాగే వార్డు అధ్యక్షులు ఆసిల్మెట్ట పార్టీ కార్యాలయానికి వచ్చి 14 వార్డులలో 60వేల సేకరించిన సంతకాల ప్రతులను వాసుపల్లి గణేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోను కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతుందని వెల్లడించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంత‌కాలు సేక‌రిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. సంతకాల సేకరణలో నేతలు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారని తెలియజేశారు. దక్షిణ ఇప్పటికే 14 వార్డులలో సంతకాల సేకరణ పూర్తి అయిందని వెల్లడించారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పార్టీలో అన్ని స్థాయిల నేతలతో పాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ రెట్టించిన ఉత్సాహంతో సంతకాల సేకరణ ముమ్మరంగా చేస్తున్నారని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో అయితే డివిజన్లను క్లస్టర్లుగా విభజించి, పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించి మరీ సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 14 వార్డులలో సేకరించిన సంతకాల సేకరణ పృతులను ఈనెల 10వ తేదీన భారీ ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆ పరిధిలో అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, దక్షిణ నియోజకవర్గం వైసిపి కార్పొరేటర్లు అలాగే వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *