
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 26 : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ కి ముఖ్య అతిథిగా విచ్చేసి న మాజీ మంత్రి ఏం ఎల్ ఏ కొండ్రు మురళి ని కలిసి అతిధి అధ్యాపకులకు నెలవారి జీతాలు రాజ్యాంగం స్ఫూర్తితో ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనాన్ని అతిధి అధ్యాపకులు కూడా అమలయ్యేలా చూడాలని కోరడం జరిగింది. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యానికి ముఖ్యంగా వీసి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ కి రెక్టార్ ప్రొఫెసర్ పులిపాటి కింగ్ కు, రిజిస్టర్ ప్రొఫెసర్ రాంబాబు ప్రిన్సిపల్స్ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా అతిధి అధ్యపకులు తెలియజేస్తున్నామని డాక్టర్ సురేష్ మీనన్, డాక్టర్ ఏం. ప్రసాదరావ్,డాక్టర్ దాస్, డాక్టర్ రాయ్, డాక్టర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
