విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 14. : ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను శుక్రవారం ఏయు రెక్టార్ ఆచార్య పి.కింగ్, యూజ్ పరీక్షల విభాగం డీన్ ఆచార్య నానాజీరావులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని ఏవిఎన్ కళాశాల, పైడా కళాశాల, బివికె కళాశాలలను వీరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు .పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పటిష్టంగా నిర్వహించాలని సంబందిత కళాశాలల నిర్వహకులకు సూచించారు. పరీక్షలలో విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కి పాల్పడినా విశ్వవిద్యాలయ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
