ప్రైవేటు విద్యాసంస్థల (Private Educational Institutions) నిర్వాహకులు తమాషా చేస్తే తాటతీస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విద్య అనేది సేవ.. వ్యాపారం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు సేవ చేయడం లేదు.. వ్యాపారం చేస్తున్నాయని సీరియస్ అయ్యారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
