
Visakha Education, November 21 : ఏ యూ పూర్వ ప్రొఫెసర్, రాజ్యసభ. రాజ్యసభ సభ్యులు, అవార్డు గ్రహీత, అంతర్జాతీయ భౌతిక శాస్త్ర నిపుణులు స్వర్గీయ ప్రొఫెసర్ బర్రి రామచంద్ర రావు (బి ఆర్ రావు ) 103 వ శాంతి స్వరూప్ భట్నాగర్ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ఆవరణలో ఆచార్య బిఆర్ రావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఉపకులపతి ఆచార్య ఎస్ వి సుధాకర్ , మాజీ రెక్టర్, విభాగాధిపతి ఆచార్య సమతా, పీజీ అండ్ ప్రాఫిషినల్ డీన్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బి. మునిస్వామి,ఏయూ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు మాట్లాడుతూ ఆచార్య బి.ఆర్ రావు విశాఖ జిల్లా ఎలమంచిలి లో నిరుపేద మత్స్యకార కుటుంబంలో జన్మించినప్పటికీ నిరక్షరాస్యత తో రాజ్యమేలుతున్న రోజులలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని విశాఖ ఏవియన్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ చదువుకొని, తదుపరి క్లిష్టమైన ఆంధ్ర యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో విద్యనభ్యసించి అక్కడే పరిశోధకుడుగా సమర్ధవంతమైన విషయ పరిజ్ఞానం తో ఆచార్యుడిగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రవేశించి తదుపరి రేడియో ఫిజిక్స్ స్పిస్ ఫిటిక్సీ తదితర విషయాలలో అనితర సాధ్యమైన పరిశోధనలు గావించి అనేక అవార్డులు సాధించడం జరిగింది. సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా సేవలందిస్తూ, ఆంధ్ర యూనివర్సిటీలో ఆరు రోజులలో మొట్టమొదటి కంప్యూటర్ సెంటర్, ల్యాబ్ లను ఏర్పాటు చేసిన వ్యక్తి, యుజిసి వైస్ చైర్మన్ గా అవకాశం రావడంతో ఢిల్లీ వెళ్లడం జరిగింది, తదుపరి తన విశేష ప్రతిభతో అనేక పరిశోధనలతో ప్రపంచస్థాయి లో అత్యుత్తమ భౌతిక శాస్త్రవేత్తల్లో ఒకరు గా నిలిచారు. ఈ సందర్భంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు రెండుసార్లు అధ్యక్షత వహించారు. అదేవిధంగా సౌత్ ఇండియాలో మొట్టమొదటి సారిగా శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతగా నిలిచారు. ఇప్పటివరకు ఈ అవార్డు సౌత్ ఇండియాలో ఇంతవరకు ఎవరికీ రాలేదు. ఈయన యొక్క విశేష ప్రతిభను గుర్తించి నాడు భారత దేశ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ దేశానికి సైంటిఫిక్ అడ్వైజర్ గా నియమించి తదుపరి 1982 లో రాజ్యసభ సభ్యుడు గా అవకాశం ఇవ్వడం జరిగింది. తరువాత రాజీవ్ గాంధీ హయంలో సైంటిఫిక్ అడ్వైజర్ ముఖ్య భూమిక వహించడం జరిగింది, ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆచార్య బర్రి రామచంద్ర రావు గల్లి స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు ప్రపంచ మేధావులతో పోటీపడి, ఈనాటి భౌతిక శాస్త్ర పరిశోదనలకు అధ్యుడిగా నిలిచారు. ఈ సందర్భంలో ఆయన మేధాశక్తికి ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా యాదృచ్చికంగా ఆయన జయంతి నాడీ ప్రపంచ మత్స్యకారి దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు హేమచంద్రరావు, ఉద్యోగ సంఘ నాయకులు తిత్తి సాయి బలరాం, పీతల అమరేంద్ర, ఒమ్మి నూకరాజు, మల్లేటి రాంబాబు, చిరంజీవి గణేష్, బీసీ సంఘం నాయకులు పితాని ప్రసాదు, వీర కుమార్, ప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
