ప్రథమ సంవత్సర విద్యార్థుల ఆహ్వాన వేడుకలు

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 21 : మనిషిగా పుట్టిన వ్యక్తి మానవతా విలువలతో బ్రతకాలని, మానవులను హీనంగా చూస్తున్న ఈ సమాజంలో మనిషి మనీషీ గా బ్రతకడం అద్వితీయం అని తెలుగు శాఖ అధిపతి జె అప్పారావు అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కొనియాడారు.ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు తమ జీవితాలను ప్రజలకోసం త్యాగం చేశారని వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి, జీవితంలో ప్రేమ, దయ,కరుణ, జాలి ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే తెలుగు శాఖలో ఉన్న ఆచార్యులు గొప్పవారని తెలియజేశారు. తెలుగు శాఖ చాలా గొప్పదని , భారతదేశంలో అత్యధిక జె ఆర్ ఆఫ్ నెట్ లు సాధించిన ఏకైక శాఖ ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖ అన్నారు. గురువుల గొప్పతనాన్ని తెలియజేశారు. స్టాటిస్టిక్స్ శాఖాధిపతి ఆచార్య మునిస్వామి గారు మాట్లాడుతూ మానవ జీవితంలో విద్య చాలా ప్రముఖమైనదని ,విద్య అమృత తుల్యమైంది అని, ప్రతి మనిషీ విలువైనవారే న , ఎవరి విలువ వారిదని. వ్యక్తుల విలువను పెంచుకోవడం కోసం జ్ఞాన సముపార్జన చేయాలని తెలియజేశారు. విద్యార్ధులు తల్లిదండ్రులను పూజించాలని అన్నారు,అదేవిధంగా సాంకేతిక విద్యా పరిజ్ఞానం కోసం చక్కగా విద్యార్థులకు వివరించారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపాల్ ఆచార్య అడ్డాడ నరసింహారావు గారు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉన్నతమైన విలువలకు నిలయం అని, తెలుగు శాఖ విద్యార్ధులు ఆ విలువలను నిలుపుతున్నారని కొనియాడారు.తెలుగు శాఖ విద్యార్ధుల చక్కని వస్త్ర ధారణను చూసి తెలుగు కట్టుబాట్లు ముందుకు నడిపిస్తున్నారని, తెలుగు భాషను అజరామరంగా కంటికి వెలుగులా కాపాడుతున్నారని, మున్ముందు తెలుగు కాపాడాలని అదీ ఆంధ్రుల అందరి బాధ్యతని తెలియజేశారు. సమాజంలో జీవిస్తున్న మనం సమాజం కోసం కూడా వృద్ధి చేయాలని విద్యార్థులకు తెలియజేశారు. ఆచార్య పి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు శాఖలో చదువుకున్న విద్యార్థులు జె ఆర్ ఆఫ్, నెట్ లు సాధిస్తున్నారని తెలుగు శాఖను కొనియాడారు.. మనిషి సంకల్పంతో ఉంటే దేనిని అయినా సాధించగలమని కొనియాడారు. డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తులకు మంచి చెడులు తెలుస్తాయని, పురాణాలు కూడా ఇవే చెబుతున్నాయి అని ఉదాహరణలతో వివరించారు .
డాక్టర్ సూర్యనారాయణగారు మాట్లాడుతూ తెలుగు శాఖకు ఎక్కడెక్కడ నుండో వచ్చి చదువుకుంటున్నారని, దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ జీవితంలో గమ్యం ఏర్పాటు చేసుకోవాలని, దానికొరకు ఎంత వరకు శ్రమించాలో అంత శ్రమించాలని, పెద్దలనుండి మంచి విషయాలను గ్రహించాలనీ అన్నారు.* డాక్టర్ దాసు మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యత రోజు రోజుకు తగ్గుతుందని అన్నారు. డాక్టర్ ప్రతాప్ గారు మాట్లాడుతూ గ్రంథాలయం సద్వినియోగం పరుచుకోవాలని తెలియజేశారు. డాక్టర్ గిరీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సమయపాలన అవసరమని, దానిని సద్వినియోగం చేయాలని అన్నారు. డాక్టర్ శివయ్య గారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన విద్యాబుద్ధులు నేర్చుకోవాలని తెలియజేశారు. విశ్రాంత ఆచార్యులు ఆచార్య గజ్జా యోహాను బాబు మాట్లాడుతూ తెలుగు శాఖ గొప్పదని, భారతదేశంలో ఉన్నటువంటి ఏ శాఖ అయినా కూడా తెలుగు శాఖను చూసి గర్విస్తుందని తెలియజేశారు. బహు గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్న గారు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు విద్యలకు నిలయమని అన్నారు .అంతే కాకుండా అంతర్జాతీయ విశ్వ విద్యాలయం ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు అని అన్నారు.ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు శతాబ్ది ఉత్సవాలు చేసుకోబోతుంది ఆ అవకాశాన్ని మీరు *వినియోగించుకుని, బాగా చదువుకుని మంచి విద్యార్థులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించండన్నారు . తెలుగు సాహిత్యానికి ఒరబడులు దిద్ది, సాహిత్యం, భాష, భాషా శాస్త్రం ,వ్యాకరణం మొదలైన విషయాలకు తెలుగు శాఖ మూలం అని, తెలుగు శాఖలో రాసిన అనేక గ్రంథాలు అందరికీ ప్రామాణికమని అన్నారు. ఈ సభలో చందు ,వాణిశ్రీ మొదలైన వారు మాట్లాడారు. విద్యార్థులు పరిశోధకులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *