గాయత్రీ విద్యాపరిషత్ డీమ్డ్ టు బి డిస్టింక్స్ కేటగిరీ విశ్వవిద్యాలయం గా

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్,సెప్టెంబర్ 21ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : : గాయత్రీ విద్యా పరిషత్ విశ్వవిద్యాలయంగా రూపొంది సోమవారం ప్రారంభోత్సవం ఘనంగా గాయత్రీ విద్యా పరిషత్ వైస్ ప్రె సిడెంట్ డి. దక్షిణామూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమపట్ల బలమైన నమ్మకంతో సదభిప్రాయంతో విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకొని వెళ్లిన తల్లితండ్రులకు, కేంద్రమంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలియుచేసి కొత్తగా చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియ చేశారు. ప్రొఫెసర్ కె.పి. ఆర్. శాస్త్రి గారు మాట్లాడు తూ విశాఖ మహానగరంలో విద్యారంగంలో గాయత్రీ విద్యాపరిషత్ సేవలను విశ్వవిద్యాలయ స్థాయికి ఆవశ్యకమైన పరిశోధనలు, విద్యార్థులకు సదుపాయాల తో ముందటగు వేసినందులకు అభినందించారు. ఆచార్య కె.యస్. బోస్, కళాశాల ప్రిన్సిపాల్ సభాసీనులయిన గాయత్రీ విద్యా సంస్థ సర్వతో ముఖమైన అభివృద్ధి అభివృద్ధి కృషిచేసిన వారి గురించి, గాయత్రీ విద్యాసంస్థల గురించి వివరిస్తూ స్కూల్ సెన్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అంట హ్యమానిటీస్. స్కూల్ ఆఫ్ ఇంజననీరింగు శాఖలతో గాయత్రీ విద్యా పరిషత్ గా అభివృది చెందినదని పేర్కొన్నారు. ఆచార్య పి. సోమరాజు విశ్వవిద్యాలయంలో కొత్తగా అడుగుపెడుతున్న విద్యార్థులు కళాశాలలో సాంకేతికతో బ్రాండ్ అంబాసిడర్లుగా చేరు కోరువాలని అన్నారు. ప్రొఫెసర్ యస్ రజని నైపుణ్యాలు సాధించి కళాశాల అనకాశములు తెలియ చేశారు.ఈ కార్యక్రంలో ప్రొఫెసర్ పి.వి.శర్మ తదితరులు పాల్గున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *