
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 21 : గొన్న కళాశాలలో జాతీయ గ్రంథాలయ ముగింపు వారోత్సవాలు ఘనంగా ముగిసాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి 20 వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామని, విద్యార్థులకు వక్తృత్వ పోటీలు కళాశాలలో నిర్వహించామని, మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులకు కళాశాల సెక్రటరీ గొన్న హేమచంద్ నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్. పి. ఎస్.న్.మూర్తి, బహుమతులు ప్రధానం చేశారు. ప్రిన్సిపాల్ గ్రంథాలయాల ఉపయోగాల గురించి వివరించారు. లైబ్రేరియన్స్ శ్రీరామ్ మూర్తి, శ్యామలరావు, కళాశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
